View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

హనుమాన్ చాలీసా (తెలుగు)

ఆపదామపహర్తారం
దాతారం సర్వసమ్పదామ్ ।
లోకాభిరామం శ్రీరామం
భూయో భూయో నమామ్యహమ్ ॥

హనుమానఞ్జనాసూనుః వాయుపుత్రో మహాబలః
రామేష్టః ఫల్గుణసఖః పిఙ్గాక్షో అమితవిక్రమః ।
ఉదధిక్రమణశ్చైవ సీతాశోకవినాశకః
లక్ష్మణప్రాణదాతా చ దశగ్రీవస్యదర్పహా ।
ద్వాదశైతాని నామాని కపీన్ద్రస్య మహాత్మనః
స్వాపకాలే పఠేన్నిత్యం యాత్రాకాలే విశేషతః
తస్య మృత్యుభయం నాస్తి సర్వత్ర విజయీభవేత్ ॥

చాలీసా
శ్రీ హనుమాను గురుదేవు చరణములు
ఇహపర సాధక శరణములు ।
బుద్ధిహీనతను కలిగిన తనువులు
బుద్బుదములని తెలుపు సత్యములు ॥

జయ హనుమన్త జ్ఞానగుణవన్దిత
జయ పణ్డిత త్రిలోకపూజిత

రామదూత అతులిత బలధామ
అఞ్జనీపుత్ర పవనసుతనామ

ఉదయభానుని మధుర ఫలమని
భావన లీల అమృతమును గ్రోలిన

కాఞ్చనవర్ణ విరాజిత వేష
కుణ్డలమణ్డిత కుఞ్చిత కేశ ॥

। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ।

రామ సుగ్రీవుల మైత్రిని గొలిపి
రాజపదవి సుగ్రీవున నిలిపి

జానకీపతి ముద్రిక దోడ్కొని
జలధి లఙ్ఘిఞ్చి లఙ్క జేరుకొని

సూక్ష్మ రూపమున సీతను జూచి
వికట రూపమున లఙ్కను గాల్చి

భీమ రూపమున అసురుల జమ్పిన
రామ కార్యమును సఫలము జేసిన

॥ శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ॥

సీత జాడగని వచ్చిన నిను గని
శ్రీ రఘువీరుడు కౌగిట నినుగొని

సహస్ర రీతుల నిను గొనియాడగ
కాగల కార్యము నీపై నిడగ

వానరసేనతో వారిధి దాటి
లఙ్కేశునితో తలపడి పోరి

హోరుహోరున పోరు సాగిన
అసురసేనల వరుసన గూల్చిన

। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ।

లక్ష్మణ మూర్ఛతో రాముడడలగ
సఞ్జీవి దెచ్చిన ప్రాణప్రదాత

రామ లక్ష్మణుల అస్త్రధాటికి
అసురవీరులు అస్తమిఞ్చిరి

తిరుగులేని శ్రీ రామబాణము
జరిపిఞ్చెను రావణ సంహారము

ఎదిరిలేని ఆ లఙ్కాపురమున
ఏలికగా విభీషణు జేసిన

। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ।

సీతారాములు నగవుల గనిరి
ముల్లోకాల హారతులన్దిరి

అన్తులేని ఆనన్దాశ్రువులే
అయోధ్యాపురి పొఙ్గిపొరలె

సీతారాముల సున్దర మన్దిరం
శ్రీకాన్తుపదం నీ హృదయం

రామచరిత కర్ణామృతగాన
రామనామ రసామృతపాన

। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ।

దుర్గమమగు ఏ కార్యమైనా
సుగమమే యగు నీ కృప జాలిన

కలుగు సుఖములు నిను శరణన్న
తొలగు భయములు నీ రక్షణ యున్న

రామ ద్వారపు కాపరివైన నీ
కట్టడి మీర బ్రహ్మాదుల తరమా

భూత పిశాచ శాకిని ఢాకిని
భయపడి పారు నీ నామ జపము విని

। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ।

ధ్వజావిరాజా వజ్రశరీరా
భుజబలతేజా గదాధరా

ఈశ్వరాంశ సమ్భూత పవిత్రా
కేసరీపుత్ర పావనగాత్రా

సనకాదులు బ్రహ్మాది దేవతలు
శారద నారద ఆదిశేషులు

యమ కుబేర దిక్పాలురు కవులు
పులకితులైరి నీ కీర్తి గానముల

। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ।

సోదర భరత సమానా యని
శ్రీ రాముడు ఎన్నిక గొన్న హనుమా

సాధుల పాలిట ఇన్ద్రుడవన్నా
అసురుల పాలిట కాలుడవన్నా

అష్టసిద్ధి నవనిధులకు దాతగ
జానకీమాత దీవిఞ్చెనుగా

రామ రసామృత పానము జేసిన
మృత్యుఞ్జయుడవై వెలసిన

। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ।

నీ నామ భజన శ్రీరామ రఞ్జన
జన్మ జన్మాన్తర దుఃఖభఞ్జన

ఎచ్చటుణ్డినా రఘువరదాసు
చివరకు రాముని చేరుట తెలుసు

ఇతర చిన్తనలు మనసున మోతలు
స్థిరముగ మారుతి సేవలు సుఖములు

ఎన్దెన్దున శ్రీరామ కీర్తన
అన్దన్దున హనుమాను నర్తన

। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ।

శ్రద్ధగ దీనిని ఆలకిమ్పుమా
శుభమగు ఫలములు కలుగు సుమా

భక్తి మీరగా గానము చేయగ
ముక్తి కలుగు గౌరీశులు సాక్షిగ

తులసిదాస హనుమాను చాలిసా
తెలుగున సులువుగ నలుగురు పాడగ

పలికిన సీతారాముని పలుకున
దోషములున్న మన్నిమ్పుమన్న

। శ్రీ హనుమాను గురుదేవు చరణములు ఇహపర సాధక శరణములు ।

మఙ్గళ హారతి గొను హనుమన్తా
సీతారామలక్ష్మణ సమేత ।
నా అన్తరాత్మ నిలుమో అనన్తా
నీవే అన్తా శ్రీ హనుమన్తా ॥

ఓం శాన్తిః శాన్తిః శాన్తిః ।




Browse Related Categories: