గానమూర్తే శ్రీకృష్ణవేణు
రాగం: గానమూర్తి తాళం: ఆది
పల్లవి గానమూర్తే శ్రీకృష్ణవేణు గానలోల త్రిభువనపాల పాహి (గా)
అను పల్లవి మానినీమణి శ్రీ రుక్మిణి మానసాపహార మారజనక దివ్య (గా)
చరణము(లు) నవనీతచోర నందసత్కిశోర నరమిత్రధీర నరసింహ శూర నవమేఘతేజ నగజాసహజ నరకాంతకాజ నరత్యాగరాజ (గా)
Browse Related Categories: