View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

తక్కువేమి మనకూ

తక్కువేమి మనకూ రాముం-డొక్కడుండు వరకూ

ప్రక్కతోడుగా భగవంతుడు
మన చక్రధారియై చెంతనె ఉండగా ॥ 1 ॥ తక్కువేమి మనకూ ॥

మ్రుచ్చుసోమకుని మును జంపిన ఆ
మత్సమూర్తి మనపక్షమునుండగా ॥ 2 ॥ తక్కువేమి మనకూ ॥

భూమిస్వర్గములు పొందుగ గొలచిన
వామనుండు మనవాడై యుండగ ॥ 3 ॥ తక్కువేమి మనకూ ॥

దశగ్రీవుముని దండించిన ఆ
ధశరధ రాముని దయ మనకుండగ ॥ 4 ॥ తక్కువేమి మనకూ ॥

దుష్టకంసునీ దుంచినట్టి శ్రీ
కృష్ణుడు మనపై గృపతో నుండగ ॥ 5 ॥ తక్కువేమి మనకూ ॥

రామదాసుని గాచెడి శ్రీ
మన్నారాయణి నెరనమ్మియుండగ ॥ 6 ॥ తక్కువేమి మనకూ ॥




Browse Related Categories: