నను పాలింప నడచి వచ్చితివో
రాగం: మోహనం (28 హరికాంభోజి జన్య) తాళం: ఆది
పల్లవి నను పాలింప నడచి వచ్చితివో నా ప్రాణ నాథ
అనుపల్లవి వనజ నయన మోమును జూచుట జీవనమని నెనరున మనసు మర్మము తెలిసి (నను)
చరణం సురపతి నీల మణి నిభ తనువుతో ఉరమున ముత్యపు సరుల చయముతో కరమున శర కోదండ కాంతితో ధరణి తనయతో త్యాగరాజార్చిత (నను)
Browse Related Categories: