View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

రామదాసు కీర్తన పలుకే బంగారమాయెనా


రాగం: ఆనంద భైరవి/ఆనంద భైరవి
20 నటభైరవి జన్య
ఆ: స గ2 రి2 గ2 మ1 ప ద2 ప ని2 స
అవ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స
తాళం: ఆది

పల్లవి
పలుకే బంగారమాయెనా, కోదండపాణి పలుకే బంగారమాయెనా

చరణం 1
పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ ॥ పలుకే బంగారమాయెనా ॥

చరణం 2
ఎంత వేడినగాని సుంతైన దయరాదు
పంతము సేయ నేనెంతటివాడను తండ్రీ ॥ పలుకే బంగారమాయెనా ॥

చరణం 3
శరణాగతత్రాణ బిరుదాంకితుడవుకాదా
కరుణించు భద్రాచల వరరామదాస పోష ॥ పలుకే బంగారమాయెనా ॥

చరణం 4
ఇరవుగ ఇసుకలోన పొరలిన ఉడుత భక్తికి
కరుణించి బ్రోచితివని నెర నమ్మితిని తండ్రీ ॥ పలుకే బంగారమాయెనా ॥

చరణం 5
రాతి నాతిగ చేసి భూతలమున
ప్రఖ్యాతి చెందితివని ప్రీతితో నమ్మితి తండ్రీ ॥ పలుకే బంగారమాయెనా ॥

పలుకే బంగారమాయె పిలచినా పలుకవేమి
కలలో నీ నామస్మరణ మరువ చక్కని తండ్రీ-పలుకే బంగారమాయెనా
పలుకే బంగారమాయెనా, కోదండపాణి పలుకే బంగారమాయెనా




Browse Related Categories: