View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

సుమతీ శతకమ్

శ్రీ రాముని దయచేతను
నారూఢిగ సకల జనులు నౌరా యనగా
ధారాళమైన నీతులు
నోరూరగ జవులు పుట్ట నుడివెద సుమతీ ॥ 1 ॥

అక్కరకు రాని చుట్టము,
మ్రొక్కిన వరమీని వేల్పు, మొహరమున దా
నెక్కిన బారని గుర్రము
గ్రక్కున విడవఙ్గవలయు గదరా సుమతీ ॥ 2 ॥

అడిగిన జీతమ్బియ్యని
మిడిమేలపు దొరను గొల్చి మిడుకుట కణ్టెన్
వడిగల యెద్దుల గట్టుక
మడి దున్నుకు బ్రతుక వచ్చు మహిలో సుమతీ ॥ 3 ॥

అడియాస కొలువు గొలువకు,
గుడి మణియము సేయబోకు, కుజనుల తోడన్
విడువక కూరిమి సేయకు,
మడవిని దోడరకొణ్టి నరుగకు సుమతీ ॥ 4 ॥

అధరము గదలియు, గదలక
మధురములగు భాష లుడుగి మౌన వ్రతుడౌ
అధికార రోగ పూరిత
బధిరాన్ధక శవము జూడ బాపము సుమతీ ॥ 5 ॥

అప్పు కొని చేయు విభవము,
ముప్పున బృఆయమ్పుటాలు, మూర్ఖుని తపమున్,
దప్పరయని నృపు రాజ్యము
దెప్పరమై మీద గీడు దెచ్చుర సుమతీ ॥ 6 ॥

అప్పిచ్చువాడు, వైద్యుడు
నెప్పుడు నెడతెగక పారు నేరును, ద్విజుడున్
జొప్పడిన యూర నుణ్డుము
చొప్పడకున్నట్టి యూరు చొరకుము సుమతీ ॥ 7 ॥

అల్లుని మఞ్చితనమ్బు,
గొల్లని సాహిత్య విద్య, కోమలి నిజమున్,
బొల్లున దఞ్చిన బియ్యము,
దెల్లని కాకులును లేవు తెలియుము సుమతీ ॥ 8 ॥

ఆకొన్న కూడె యమృతము,
తాకొఞ్చక నిచ్చువాఙ్డె దాత ధరిత్రిన్,
సోకోర్చువాడె మనుజుడు,
తేకువ గలవాడె వంశ తిలకుడు సుమతీ ॥ 9 ॥

ఆకలి యుడుగని కడుపును,
వేకటియగు లఞ్జ పడుపు విడువని బ్రతుకున్,
బ్రాకొన్న నూతి యుదకము,
మేకల పాడియును రోత మేదిని సుమతీ ॥ 10 ॥

ఇచ్చునదే విద్య, రణమున
జొచ్చునదే మగతనమ్బు, సుకవీశ్వరులున్
మెచ్చునదే నేర్చు, వదుకు
వచ్చునదే కీడు సుమ్ము వసుధను సుమతీ ॥ 11 ॥

ఇమ్ముగ జదువని నోరును,
నమ్మా యని బిలిచి యన్న మడుగని నోరున్,
దమ్ముల బిలువని నోరును
గుమ్మరి మను ద్రవ్వినట్టి గుణ్టర సుమతీ ॥ 12 ॥

ఉడుముణ్డదె నూరేణ్డ్లును,
బడియుణ్డదె పేర్మి బాము పదినూరేణ్డ్లున్,
మడువున గొక్కెర యుణ్డదె,
కడు నిల బురుషార్థ పరుడు గావలె సుమతీ ॥ 13 ॥

ఉత్తమగుణములు నీచున
కెత్తెఱగున గలుగ నేర్చు; నెయ్యెడలం దా
నెత్తిచ్చి కరగి పోసిన
నిత్తడి బఙ్గారమగునె యిలలో సుమతీ? ॥ 14 ॥

ఉదకము ద్రావెడు హయమును,
మదమున నుప్పొఙ్గుచుణ్డు మత్తేభమ్బున్,
మొదవు కడ నున్న వృషభము,
జదువని యానీచు గడకు జనకుర సుమతీ ॥ 15 ॥

ఉపకారికి నుపకారము
విపరీతము గాదు సేయ వివరిమ్పఙ్గా;
నపకారికి నుపకారము
నెపమెన్నక సేయువాడు నేర్పరి సుమతీ ॥ 16 ॥

ఉపమిమ్ప మొదలు తియ్యన
కపటం బెడనెడను జెఱకు కై వడినే పో
నెపములు వెదకును గడపట
గపటపు దుర్జాతి పొన్దు గదరా సుమతీ ॥ 17 ॥

ఎప్పటి కెయ్యది ప్రస్తుత
మప్పటికా మాటలాడి, యన్యుల మనముల్
నొప్పిఞ్చక, తా నొవ్వక,
తప్పిఞ్చుక తిరుగువాడు ధన్యుడు సుమతీ ॥ 18 ॥

ఎప్పుడు దప్పులు వెదకెడు
నప్పురుషుని గొల్వగూడ దది యెట్లన్నన్
సర్పమ్బు పడగ నీడను
గప్ప వసిఞ్చిన విధమ్బు గదరా సుమతీ ॥ 19 ॥

ఎప్పుడు సమ్పద కలిగిన
నప్పుడు బన్ధువులు వత్తు రది యెట్లన్నన్
తెప్పలుగ జెఱువు నిణ్డిన
గప్పలు పదివేలు చేరు గదరా సుమతీ ॥ 20 ॥

ఏఱకుమీ కసుగాయలు,
దూఱకుమీ బన్ధుజనుల దోషము సుమ్మీ,
పాఱకుమీ రణమన్దున,
మీఱకుమీ గురువు నాజ్ఞ మేదిని సుమతీ ॥ 21 ॥

ఒక యూరికి నొక కరణము,
నొక తీర్పరియైన గాక, నొగి దఱుచైనన్,
గకవికలు గాక యుణ్డునె
సకలమ్బును గొట్టువడక సహజము సుమతీ ॥ 22 ॥

ఒరు నాత్మ దలచు సతి విడు,
మఱుమాటలు పలుకు సతుల మన్నిమ్పకుమీ,
వెఱ పెఱుగని భటునేలకు,
తఱచుగ సతి గవయ బోకు, తగదుర సుమతీ ॥ 23 ॥

ఒల్లని సతి నొల్లని పతి,
నొల్లని చెలికాని విడువ నొల్లని వాడే
గొల్లణ్డు, కాక ధరలో
గొల్లణ్డును గొల్లడౌనె గుణమున సుమతీ ॥ 24 ॥

ఓడల బణ్డ్లును వచ్చును,
ఓడలు నాబణ్డ్లమీద నొప్పుగ వచ్చున్,
ఓడలు బణ్డ్లును వలనే
వాడమ్బడు గలిమి లేమి వసుధను సుమతీ ॥ 25 ॥

కడు బలవన్తుడైనను
బుడమిని బ్రాయమ్పుటాలి బుట్టిన యిణ్టన్
దడవుణ్డ నిచ్చెనేనియు
బడుపుగ నఙ్గడికి దానె బమ్పుట సుమతీ ॥ 26 ॥

కనకపు సింహాసనమున
శునకము గూర్చుణ్డబెట్టి శుభ లగ్నమునం
దొనరగ బట్టము గట్టిన
వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ ॥ 27 ॥

కప్పకు నొరగాలైనను,
సర్పమునకు రోగమైన, సతి తులువైనన్,
ముప్పున దరిద్రుడైనను,
తప్పదు మఱి దుఃఖ మగుట తథ్యము సుమతీ ॥ 28 ॥

కమలములు నీట బాసిన
కమలాప్తుని రశ్మి సోకి కమలిన భఙ్గిన్
తమ తమ నెలవులు దప్పిన
తమ మిత్రులు శత్రులౌట తథ్యము సుమతీ ॥ 29 ॥

కరణము గరణము నమ్మిన
మరణాన్తక మౌను గాని మనలేడు సుమీ,
కరణము దన సరి కరణము
మఱి నమ్మక మర్మ మీక మనవలె సుమతీ ॥ 30 ॥

కరణముల ననుసరిమ్పక
విరసమ్బున దిన్న తిణ్డి వికటిఞ్చు జుమీ
యిరుసున కన్దెన బెట్టక
పరమేశ్వరు బణ్డి యైన బారదు సుమతీ ॥ 31 ॥

కరణము సాదైయున్నను,
గరి మద ముడిగినను, బాము గఱవక యున్నన్,
ధర దేలు మీటకున్నను,
గర మరుదుగ లెక్క గొనరు గదరా సుమతీ ॥ 32 ॥

కసుగాయ గఱచి చూచిన
మసలక పస యొగరు రాక మధురమ్బగునా,
పస గలుగు యువతులుణ్డగ
పసి బాలల బొన్దువాడు పశువుర సుమతీ ॥ 33 ॥

కవి కాని వాని వ్రాతయు,
నవరస భావములు లేని నాతుల వలపున్,
దవిలి చను పన్ది నేయని
వివిధాయుధ కౌశలమ్బు వృధరా సుమతీ ॥ 34 ॥

కాదు సుమీ దుస్సఙ్గతి,
పోదుసుమీ "కీర్తి" కాన్త పొన్దిన పిదపన్,
వాదు సుమీ యప్పిచ్చుట,
లేదు సుమీ సతుల వలపు లేశము సుమతీ ॥ 35 ॥

కాముకుడు దనిసి విడిచిన
కోమలి బరవిటుడు గవయ గోరుట యెల్లన్
బ్రేమమున జెఱకు పిప్పికి
చీమలు వెస మూగినట్లు సిద్ధము సుమతీ ॥ 36 ॥

కారణము లేని నగవును,
బేరణము లేని లేమ, పృథివీ స్థలిలో
బూరణము లేని బూరెయు,
వీరణము లేని పెణ్డ్లి వృధరా సుమతీ ॥ 37 ॥

కులకాన్త తోడ నెప్పుడు
గలహిమ్పకు, వట్టి తప్పు ఘటియిమ్పకుమీ,
కలకణ్ఠి కణ్ట కన్నీ
రొలికిన సిరి యిణ్ట నుణ్డ నొల్లదు సుమతీ ॥ 38 ॥

కూరిమి గల దినములలో
నేరము లెన్నడును గలుగ నేరవు మఱి యా
కూరిమి విరసమ్బైనను
నేరములే తోచు చుణ్డు నిక్కము సుమతీ ॥ 39 ॥

కొఞ్చెపు నరు సఙ్గతిచే
నఞ్చితముగ గీడు వచ్చు నది యెట్లన్నన్
గిఞ్చిత్తు నల్లి కుట్టిన
మఞ్చమునకు జేటు వచ్చు మహిలో సుమతీ ॥ 40 ॥

కొక్కోకమెల్ల జదివిన,
చక్కనివాడైన, రాజ చన్ద్రుణ్డైనన్,
మిక్కిలి రొక్కము లియ్యక,
చిక్కదురా వారకాన్త సిద్ధము సుమతీ ॥ 41 ॥

కొఱ గాని కొడుకు బుట్టిన
కొఱ గామియె కాదు, తణ్డ్రి గుణముల జెఱచున్
చెఱకు తుద వెన్ను బుట్టిన
జెఱకున తీపెల్ల జెఱచు సిద్ధము సుమతీ ॥ 42 ॥

కోమలి విశ్వాసమ్బును,
బాములతో జెలిమి, యన్య భామల వలపున్,
వేముల తియ్యదనమ్బును,
భూమీశుల నమ్మికలును బొఙ్కుర సుమతీ ॥ 43 ॥

గడన గల మగని జూచిన
నడుగడుగున మడుగు లిడుదు రతివలు దమలో,
గడ నుడుగు మగని జూచిన
నడ పీనుగు వచ్చె నఞ్చు నగుదురు సుమతీ ॥ 44 ॥

చిన్తిమ్పకు కడచిన పని,
కిన్తులు వలతురని నమ్మ కెన్తయు మదిలో,
నన్తఃపుర కాన్తలతో
మన్తనముల మాను మిదియె మతముర సుమతీ ॥ 45 ॥

చీమలు పెట్టిన పుట్టలు
పాముల కిరవైనయట్లు పామరుడు దగన్
హేమమ్బు గూడ బెట్టిన
భూమీశుల పాల జేరు భువిలో సుమతీ ॥ 46 ॥

చుట్టములు గాని వారలు
చుట్టములము నీకటఞ్చు సొమ్పు దలిర్పన్
నెట్టుకొని యాశ్రయిన్తురు
గట్టిగ ద్రవ్యమ్బు గలుగ గదరా సుమతీ ॥ 47 ॥

చేతులకు దొడవు దానము,
భూతలనాథులకు దొడవు బొఙ్కమి ధరలో,
నీతియె తొడవెవ్వారికి,
నాతికి మానమ్బు తొడవు నయముగ సుమతీ ॥ 48 ॥

తడ వోర్వక, యొడ లోర్వక,
కడు వేగం బడిచి పడిన గార్యం బగునే,
తడ వోర్చిన, నొడ లోర్చిన,
జెడిపోయిన కార్యమెల్ల జేకుఱు సుమతీ ॥ 49 ॥

తన కోపమె తన శత్రువు,
తన శాన్తమె తనకు రక్ష, దయ చుట్టమ్బౌ
తన సన్తోషమె స్వర్గము,
తన దుఃఖమె నరక మణ్డ్రు తథ్యము సుమతీ ॥ 50 ॥

తన యూరి తపసి తపమును,
తన పుత్రుని విద్య పెమ్పు, దన సతి రూపున్,
దన పెరటి చెట్టు మన్దును,
మనసున వర్ణిమ్పరెట్టి మనుజులు సుమతీ ॥ 51 ॥

తన కలిమి యిన్ద్ర భోగము,
తన లేమియె స్వర్గలోక దారిద్ర్యమ్బున్,
దన చావు జల ప్రళయము,
తను వలచిన యదియె రమ్భ తథ్యము సుమతీ ॥ 52 ॥

తన వారు లేని చోటను,
జనమిఞ్చుక లేని చోట, జగడము చోటన్,
అనుమానమైన చోటను,
మనుజునకును నిలువ దగదు మహిలో సుమతీ ॥ 53 ॥

తమలము వేయని నోరును,
విమతులతో చెలిమి చేసి వెతబడు తెలివిన్,
గమలములు లేని కొలకును,
హిమధాముడు లేని రాత్రి హీనము సుమతీ ॥ 54 ॥

తలనుణ్డు విషము ఫణికిని,
వెలయఙ్గా దోక నుణ్డు వృశ్చికమునకున్,
తల తోక యనక యుణ్డును
ఖలునకు నిలువెల్ల విషము గదరా సుమతీ ॥ 55 ॥

తలపొడుగు ధనము పోసిన
వెలయాలికి నిజము లేదు వివరిమ్పఙ్గా
దల దడివి బాస జేసిన
వెలయాలిని నమ్మరాదు వినరా సుమతీ ॥ 56 ॥

తల మాసిన, నొలు మాసిన,
వలువలు మాసినను బ్రాణ వల్లభునైనన్
గులకాన్తలైన రోతురు
తిలకిమ్పగ భూమిలోన దిరముగ సుమతీ ॥ 57 ॥

తాను భుజిమ్పని యర్థము
మానవ పతి జేరు గొన్త మఱి భూగతమౌ
గానల నీగలు గూర్చిన
తేనియ యొరు జేరునట్లు తిరముగ సుమతీ ॥ 58 ॥

దగ్గఱ కొణ్డెము సెప్పెడు
ప్రెగ్గడ పలుకులకు రాజు ప్రియుడై మఱి దా
నెగ్గు బ్రజ కాచరిఞ్చుట
బొగ్గులకై కల్పతరువు బొడుచుట సుమతీ ॥ 59 ॥

ధనపతి సఖుడై యుణ్డిన
నెనయఙ్గా శివుడు భిక్షమెత్తగ వలసెన్,
దన వారి కెన్త గలిగిన
దన భాగ్యమె తనకు గాక తథ్యము సుమతీ ॥ 60 ॥

ధీరులకు జేయు మేలది
సారమ్బగు నారికేళ సలిలము భఙ్గిన్
గౌరవమును మఱి మీదట
భూరి సుఖావహము నగును భువిలో సుమతీ ॥ 61 ॥

నడువకుమీ తెరువొక్కట,
గుడువకుమీ శత్రు నిణ్ట గూరిమి తోడన్,
ముడువకుమీ పరధనముల,
నుడువకుమీ యొరుల మనసు నొవ్వగ సుమతీ ॥ 62 ॥

నమ్మకు సుఙ్కరి, జూదరి,
నమ్మకు మొగసాల వాని, నటు వెలయాలిన్,
నమ్మకు మఙ్గడి వానిని,
నమ్మకు మీ వామ హస్తు నవనిని సుమతీ ॥ 63 ॥

నయమున బాలుం ద్రావరు,
భయమునను విషమ్మునైన భక్షిన్తురుగా,
నయమెన్త దోషకారియొ,
భయమే జూపఙ్గ వలయు బాగుగ సుమతీ ॥ 64 ॥

నరపతులు మేఱ దప్పిన,
దిరమొప్పగ విధవ యిణ్ట దీర్పరి యైనన్,
గరణము వైదికుడైనను,
మరణాన్తక మౌనుగాని మానదు సుమతీ ॥ 65 ॥

నవరస భావాలఙ్కృత
కవితా గోష్టియును, మధుర గానమ్బును దా
నవివేకి కెన్త జెప్పిన
జెవిటికి శఙ్ఖూదినట్లు సిద్ధము సుమతీ ॥ 66 ॥

నవ్వకుమీ సభ లోపల,
నవ్వకుమీ తల్లి, దణ్డ్రి, నాథుల తోడన్,
నవ్వకుమీ పరసతితో,
నవ్వకుమీ విప్రవరుల నయమిది సుమతీ ॥ 67 ॥

నీరే ప్రాణాధారము
నోరే రసభరితమైన నుడువుల కెల్లన్
నారియె నరులకు రత్నము
చీరయె శృఙ్గారమణ్డ్రు సిద్ధము సుమతీ ॥ 68 ॥

పగవల దెవ్వరి తోడను,
వగవఙ్గా వలదు లేమి వచ్చిన పిదపన్,
దెగ నాడ వలదు సభలను
మగువకు మనసియ్య వలదు మహిలో సుమతీ ॥ 69 ॥

పతికడకు, దన్ను గూరిన
సతికడకును, వేల్పు కడకు, సద్గురు కడకున్,
సుతుకడకు రిత్తచేతుల
మతిమన్తులు చనరు నీతి మార్గము సుమతీ ॥ 70 ॥

పనిచేయునెడల దాసియు,
ననుభవమున రమ్భ, మన్త్రి యాలోచనలన్,
దనభుక్తి యెడల దల్లియు,
నన్ దన కులకాన్త యుణ్డు నగురా సుమతీ ॥ 71 ॥

పరనారీ సోదరుడై,
పరధనముల కాసపడక, పరులకు హితుడై,
పరులు దను బొగడ నెగడక,
పరు లలిగిన నలుగ నతడు పరముడు సుమతీ ॥ 72 ॥

పరసతి కూటమి గోరకు,
పరధనముల కాసపడకు, బరునెఞ్చకుమీ,
సరిగాని గోష్టి సేయకు,
సిరిచెడి చుట్టమ్బు కడకు జేరకు సుమతీ ॥ 73 ॥

పరసతుల గోష్ఠి నుణ్డిన
పురుషుడు గాఙ్గేయుడైన భువి నిన్ద పడున్,
బరసతి సుశీలయైనను
బరుసఙ్గతి నున్న నిన్ద పాలగు సుమతీ ॥ 74 ॥

పరులకు నిష్టము సెప్పకు,
పొరుగిణ్డ్లకు బనులు లేక పోవకు మెపుడున్,
బరు గదిసిన సతి గవయకు,
మెఱిగియు బిరుసైన హయము లెక్కకు సుమతీ ॥ 75 ॥

పర్వముల సతుల గవయకు,
ముర్వీశ్వరు కరుణ నమ్మి యుబ్బకు మదిలో,
గర్విమ్ప నాలి బెమ్పకు,
నిర్వహణము లేని చోట నిలువకు సుమతీ ॥ 76 ॥

పలు దోమి సేయు విడియము,
తలగడిగిన నాటి నిద్ర, తరుణులయెడలన్
బొల యలుక నాటి కూటమి
వెల యిన్తని చెప్పరాదు వినరా సుమతీ ॥ 77 ॥

పాటెఱుగని పతి కొలువును,
గూటమ్బున కెఱుకపడని కోమలి రతియున్,
బేటెత్త జేయు చెలిమియు,
నేటికి నెదురీదినట్టు లెన్నగ సుమతీ ॥ 78 ॥

పాలను గలసిన జలమును
పాల విధమ్బుననె యుణ్డు బరికిమ్పఙ్గా
పాల చవి జెఱచు గావున
పాలసుడగు వాని పొన్దు వలదుర సుమతీ ॥ 79 ॥

పాలసునకైన యాపద
జాలిమ్బడి తీర్ప దగదు సర్వజ్ఞునకున్
తేలగ్ని బడగ బట్టిన
మేలెఱుగునె మీటు గాక మేదిని సుమతీ ॥ 80 ॥

పిలువని పనులకు బోవుట,
గలయని సతి గతియు, రాజు గానని కొలువుం,
బిలువని పేరణ్టమ్బును,
వలువని చెలిమియును జేయ వలదుర సుమతీ ॥ 81 ॥

పుత్రోత్సాహము తణ్డ్రికి
పుత్రుడు జన్మిఞ్చినపుడె పుట్టదు, జనులా
పుత్రుని కనుగొని బొగడగ
పుత్రోత్సాహమ్బు నాడు పొన్దుర సుమతీ ॥ 82 ॥

పురికిని ప్రాణము గోమటి,
వరికిని ప్రాణమ్బు నీరు వసుమతి లోనన్,
గరికిని ప్రాణము తొణ్డము,
సిరికిని ప్రాణమ్బు మగువ సిద్ధము సుమతీ ॥ 83 ॥

పులి పాలు దెచ్చి యిచ్చిన,
నలవడగా గుణ్డె గోసి యఱచే నిడినన్,
దలపొడుగు ధనము బోసిన,
వెలయాలికి గూర్మి లేదు వినరా సుమతీ ॥ 84 ॥

పెట్టిన దినముల లోపల
నట్టడవులనైన వచ్చు నానార్థములున్,
బెట్టని దినముల గనకపు
గట్టెక్కిన నేమి లేదు గదరా సుమతీ ॥ 85 ॥

పొరుగున బగవాడుణ్డిన,
నిరవొన్దక వ్రాతకాడె యేలిక యైనన్,
ధర గాపు కొణ్డెమాడిన,
గరణాలకు బ్రదుకు లేదు గదరా సుమతీ ॥ 86 ॥

బఙ్గారు కుదువ బెట్టకు,
సఙ్గరమున బాఱిపోకు సరసుడవైతే,
నఙ్గడి వెచ్చము వాడకు,
వెఙ్గలితో జెలిమి వలదు వినరా సుమతీ ॥ 87 ॥

బలవన్తుడ నాకేమని
పలువురతో నిగ్రహిఞ్చి పలుకుట మేలా,
బలవన్త మైన సర్పము
చలి చీమల చేత జిక్కి చావదె సుమతీ ॥ 88 ॥

మదినొకని వలచి యుణ్డగ
మదిచెడి యొక క్రూర విటుడు మానక తిరుగున్
బది చిలుక పిల్లి పట్టిన
జదువునె యాపఞ్జరమున జగతిని సుమతీ ॥ 89 ॥

మణ్డల పతి సముఖమ్బున
మెణ్డైన ప్రధాని లేక మెలగుట యెల్లన్
గొణ్డన్త మదపు టేనుగు
తొణ్డము లేకుణ్డినట్లు దోచుర సుమతీ ॥ 90 ॥

మన్త్రిగలవాని రాజ్యము
తన్త్రము సెడకుణ్డ నిలుచు దఱచుగ ధరలో
మన్త్రి విహీనుని రాజ్యము
జన్త్రపు గీలూడినట్లు జరుగదు సుమతీ ॥ 91 ॥

మాటకు బ్రాణము సత్యము,
కోటకు బ్రాణమ్బు సుభట కోటి, ధరిత్రిన్
బోటికి బ్రాణము మానము,
చీటికి బ్రాణమ్బు వ్రాలు సిద్ధము సుమతీ ॥ 92 ॥

మానధను డాత్మధృతి చెడి
హీనుణ్డగు వాని నాశ్రయిఞ్చుట యెల్లన్
మానెడు జలముల లోపల
నేనుగు మెయి దాచినట్టు లెఱుగుము సుమతీ ॥ 93 ॥

మేలెఞ్చని మాలిన్యుని,
మాలను, మొగసాలెవాని, మఙ్గలి హితుగా
నేలిన నరపతి రాజ్యము
నేల గలసి పోవుగాని నెగడదు సుమతీ ॥ 94 ॥

రాపొమ్మని పిలువని యా
భూపాలుని గొల్వ భుక్తి ముక్తులు గలవే
దీపమ్బు లేని యిణ్టను
జేపున కీళ్ళాడినట్లు సిద్ధము సుమతీ ॥ 95 ॥

రూపిఞ్చి పలికి బొఙ్కకు,
ప్రాపగు చుట్టమ్బు నెగ్గు పలుకకు మదిలో,
గోపిఞ్చు రాజు గొల్వకు,
పాపపు దేశమ్బు సొఱకు పదిలము సుమతీ ॥ 96 ॥

లావిగలవాని కణ్టెను
భావిమ్పగ నీతిపరుడు బలవన్తుణ్డౌ
గ్రానమ్బన్త గజమ్బును
మావటివాడెక్కినట్లు మహిలో సుమతీ ॥ 97 ॥

వఱదైన చేను దున్నకు,
కఱవైనను బన్ధుజనుల కడ కేగకుమీ,
పరులకు మర్మము చెప్పకు,
పిరికికి దళవాయి తనము పెట్టకు సుమతీ ॥ 98 ॥

వరిపణ్ట లేని యూరును,
దొర యుణ్డని యూరు, తోడు దొరకని తెరువున్,
ధరను పతి లేని గృహమును
నరయఙ్గా రుద్రభూమి యనదగు సుమతీ ॥ 99 ॥

వినదగు నెవ్వరు జెప్పిన
వినినన్తనె వేగ పడక వివరిమ్ప దగున్
కని కల్ల నిజము దెలిసిన
మనుజుడె పో నీతి పరుడు మహిలో సుమతీ ॥ 100 ॥

వీడెము సేయని నోరును,
జేడెల యధరామృతమ్బు సేయని నోరున్,
పాడఙ్గరాని నోరును
బూడిద కిరవైన పాడు బొన్దర సుమతీ ॥ 101 ॥

వెలయాలి వలన గూరిమి
గలగదు, మఱి గలిగెనేని కడతేఱదుగా,
బలువురు నడచెడు తెరువున
మొలవదు పువు, మొలిచెనేని పొదలదు సుమతీ ॥ 102 ॥

వెలయాలు చేయు బాసలు,
వెలయగ మొగసాల బొన్దు వెలమల చెలిమిన్,
గలలోన గన్న కలిమియు
విలసితముగ నమ్మరాదు వినరా సుమతీ ॥ 103 ॥

వేసరపు జాతి గానీ,
వీసము దా జేయనట్టి వీరిడి గానీ,
దాసి కొడుకైన గానీ,
కాసులు గల వాడె రాజు గదరా సుమతీ ॥ 104 ॥

శుభముల పొన్దని చదువును,
నభినయముగ రాగరసము నన్దని పాటల్,
గుభ గుభలు లేని కూటమి,
సభ మెచ్చని మాటలెల్ల జప్పన సుమతీ ॥ 105 ॥

సరసము విరసము కొఱకే,
పరిపూర్ణ సుఖమ్బు లధిక బాధల కొఱకే,
పెరుగుట విరుగుట కొఱకే,
ధర తగ్గుట హెచ్చు కొఱకె తథ్యము సుమతీ ॥ 106 ॥

సిరి తా వచ్చిన వచ్చును
సలలితముగ నారికేళ సలిలము భఙ్గిన్,
సిరి తా బోయిన బోవును
కరి మ్రిఙ్గిన వెలగ పణ్డు కరణిని సుమతీ ॥ 107 ॥

స్త్రీల యెడ వాదులాడకు,
బాలురతో జెలిమిచేసి భాషిమ్పకుమీ,
మేలైన గుణము విడువకు,
మేలిన పతి నిన్ద సేయ కెన్నడు సుమతీ ॥ 108 ॥




Browse Related Categories: