View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

వేమన శతకమ్

తలపులోన గలుగు దా దైవమే ప్రొద్దు
తలచి చూడనతకు తత్వమగును
వూఱకుణ్డ నేర్వునుత్తమ యోగిరా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 1 ॥

తన విరక్తి యనెడి దాసి చేతను జిక్కి
మిగిలి వెడలవేక మిణుకుచున్న
నరుడి కేడముక్తి వరలెడి చెప్పడీ
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 2 ॥

తనదు మనసుచేత దర్కిఞ్చి జ్యోతిష
మెన్త చేసే ననుచు నెఞ్చి చూచు,
తన యదృష్టమన్త దైవ మెఱుఙ్గడా?
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 3 ॥

టీక వ్రాసినట్లేనేకులు పెద్దలు
లోకమన్దు జెప్పి మఞ్చు
కాకులట్టి జనుల కానరీ మర్మము
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 4 ॥

జ్ఞానమెన్న గురువు జ్ఞానహైన్యము బుద్ధి
రెణ్టినన్దు రిమ్మరేచునపుడు
రిమ్మ తెలిపెనేని రెణ్డొక రూపురా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 5 ॥

జాణలమని యన్ద్రు చపలాత్ములగువారు
తెలివిలేక తమ్ముతెలియలేరు
కష్టమైన యడవి గాసీలుచున్నారు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 6 ॥

జనన మరణములన స్వప్న సుషుప్తులు
జగములన్దు నెణ్డ జగములుణ్డు
నరుడు జగమునణ్ట నడుబాటు కాదొకో
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 7 ॥

ఛాయననొసగుచెట్లు సాధువు బోధట్టు
లడగి దరినిజేరి పడయవచ్చు
నట్టునిట్టు దాటనది పోవునిది రామ
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 8 ॥

నరుడెయైన లేక నారాయణుణ్డైన
తత్త్వబద్ధుడైన దరణి నరయ
మరణమున్నదనుచు మదిని నమ్మగవలె
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 9 ॥

ద్వారమ్బన్ధమునకు దలుపులు గడియలు
వలెనె నోటికొప్పుగల నియతులు
ధర్మమెరిగి పలుక ధన్యుణ్డౌ భువిలోన
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 10 ॥

బ్రహ్మఘటము మేను ప్రాణమ్బు తగగాలి
మిత్రచన్ద్ర శిఖులు నేత్రచయము
మఱియు బ్రహ్మమనగ మహిమీద లేదయా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 11 ॥

యోగిననుచు గొన్త యోగముగూర్చక
జగమునెల్లబట్ట చమ్పి తినుచు
ధనము కొఱకు వాడు తగవాడుచుణ్డిన
యోగికాడు వాడె యోగు వేమ! ॥ 12 ॥

అర్ధ యఙ్కణమున కాధారమైనట్టి
యొణ్టిమేడ గుఞ్జు నొనరనిల్పె
నిణ్టికొక మగణ్డె యిల్లాణ్డ్రునేద్గురు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 13 ॥

అన్నదానమునకు నధిక సమ్పదగల్గి
యమరలోక పూజ్యుడగును మీఱు
అన్నమగును బ్రహ్మమది కనలేరయా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 14 ॥

బొన్ది యెవరి సొమ్ము పోషిమ్పబలుమారు
ప్రాణ మెవరి సొమ్ము భక్తిసేయ,
ధనమదెవరిసొమ్ము ధర్మమె తన సొమ్ము
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 15 ॥

పణ్డువలన బుట్టె బరగ ప్రపఞ్చము
పణ్డువలన బుట్టె పరము నిహము
పణ్డు మేలెఱిఙ్గె బ్రహ్లాదుడిలలోన
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 16 ॥

తపమువేల? యరయ ధాత్రిజనులకెల్ల
నొనర శివుని జూడ నుపమ గలదు
మనసు చదరనీక మహిలోన జూడరా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 17 ॥

తనగుణము తనకు నుణ్డగ
నెనయఙ్గా నోరుని గుణము నెఞ్చును మదిలో
దన గుణము తెలియ కన్యుని
బనిగొని దూషిఞ్చువాడు వ్యర్థుడు వేమ! ॥ 18 ॥

జాలినొన్దరాదు జవదాటి కనరాదు
అది మూలమైన ఆత్మమఱుగు
పోరిచేరి పొన్ది పూర్ణము నన్దురా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 19 ॥

జాతి, మతము విడిచి చని యోగికామేలు
జాతితో నెయున్న నీతివలదె
మతముబట్టి జాతి మానకుణ్ట కొఱన్త
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 20 ॥

నీవనినను నేననినను
భావమ్మున నెఱుకయొక్క పద్ధతియగునా
భావమ్బు దెలిసి మదిని
ర్భావముగా నిన్ను గనుట పరమగు వేమ! ॥ 21 ॥

నీళ్ల మునుగునేల? నిధుల మెట్టగనేల
మొనసి వేల్పులకును మ్రొక్కనేల
కపట కల్మషములు కడుపులో నుణ్డగా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 22 ॥

పఞ్చ ముఖములన్దు బఞ్చాక్షరి జనిఞ్చె
పఞ్చ వర్ణములను ప్రబలె జగము
పఞ్చముఖుని మీరు ప్రస్తుతి చేయుణ్డీ
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 23 ॥

నేయి వెన్న కాచి నీడనే యుఞ్చిన
బేరి గట్టిపడును పెరుగురీతి
పోరిపోరి మదిని పోనీక పట్టుము
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 24 ॥

మణ్టికుణ్డవణ్టి మాయ శరీరమ్బు
చచ్చునెన్నడైన, చావదాత్మ
ఘటములెన్నియైన గగనమొక్కటేగదా,
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 25 ॥

మణ్ట లోహమన్దు మ్రాకుల శిలలన్దు
పటములన్దు గోడప్రతిమలన్దు
తన్నుదెలియు కొఱకుదగులదా పరమాత్మ
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 26 ॥

నిమిషమైనను మది నిల్చి నిర్మలముగ
లిఙ్గ జీవావేశులను గాఞ్చి భఙ్గపడక
పూజ మదియన్దు జేరుట పూర్ణపదవి
పరము గోరిన నిదిచేయ బాగు వేమ! ॥ 27 ॥

ధూమాదుల నావృతమై
వ్యోమమ్బునకెగని కలియు నుపములు తనలో
శ్రీమిఞ్చు శివుని జేరును
గామాదుల గలియడతడు ఘనముగ వేమ! ॥ 28 ॥

పగలుడుగ నాసలుడుగును
వగపుడుగం గోర్కెలుడుగు వడి జన్మమ్బుల్
తగులుడుగు భోగముడిగిన
త్రిగుణమ్బును నడుగ ముక్తి తెరువగు వేమ! ॥ 29 ॥

పాల నీటి కలత పరమహంస మెఱుగును
నీరు పాలు నెట్లు నేర్చునెమలి
లజ్ఞుడైన హీనుడల శివు నెఱుగునా?
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 30 ॥

పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల
పుట్టి గిట్టలేదె పూర్వులెవరు
పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాన్తులు సుమీ,
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 31 ॥

పరుల విత్తమన్దు భ్రాన్తి వాసినయట్టి
పురుషుడవనిలోన పుణ్యమూర్తి
పరుల విత్తమరయ పాపసఞ్చితమగు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 32 ॥

పరధనమ్బులకును ప్రాణములిచ్చును
సత్యమన్తలేక జారడగును
ద్విజులమఞ్చు నిన్త్రుతేజమిఞ్చుకలేదు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 33 ॥

నోరు పలకవచ్చు నుడి వ్రాయగరాదు
వ్రాతకన్న సాక్షి వలవదన్న
పరగలేని వ్రాత భఙ్గ పాటున్దెచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 34 ॥

నిజమాకల్ల రెణ్డు నీలకణ్ఠుడెఱుఙ్గు
నిజములాడకున్న నీతిదప్పు
నిజములాడునపుడు నీ రూపమనవచ్చు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 35 ॥

దశగలారినెల్ల దమ బన్ధువు లటణ్డ్రు
దశయలేమి నెన్త్రు తక్కువగను
దశయన గమ ధన దశమొక్కటే దశ
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 36 ॥

తామసిఞ్చి చేయదగ దెట్టి కార్యమ్బు
వేగిరిమ్ప నదియు విషమగును
పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనే
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 37 ॥

తల్లిబిడ్డలకును తగవు పుట్టిఞ్చెడి
ధనము సుఖము గూర్చునని గడిన్త్రు
కాని యెల్లయెడల ఘన దుఃఖన్​దమది
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 38 ॥

తల్లిదణ్డ్రులెన్నదగు తొలి గురువులు
పార్వతీభవు లిలబరమగురులు
కూలివాణ్డ్ర జగతి గురులన ద్రోహము
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 39 ॥

తామసిఞ్చి చేయదగ దెట్టి కార్యమ్బు
వేగిరిమ్ప నదియు విషమగును
పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనే
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 40 ॥

పుట్టు పుట్టలేదే పుడమిని జనులెల్ల
పుట్టి గిట్టలేదె పూర్వులెవరు
పుట్టి గిట్టుటెల్ల వట్టి భ్రాన్తులు సుమీ,
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 41 ॥

పెట్టిపోయలేని వట్టి దేబెలు భూమి
బుట్టిరేమి వారు గిట్టరేమి
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా!
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 42 ॥

లోకమన్దుబుట్టి లోకమన్దె పెరిగి
లోక విభవమోర్వలేక జనుడు
లోకమన్దు జనికి లోబడి చెడిపోవును
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 43 ॥

మది గలిగిన పూజ మదనారి మెచ్చును
మనసు నిల్సినన్త మహితుడగును
మనసులేని పూజ మట్టి సమానము
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 44 ॥

తామును జనులేమను కొన
బూనుదురో దాని సరసి పొన్దిన జడనీ,
రాని పధమ్బున నడిచిన
దాననె ధర్మాత్ముడణ్డ్రు తన్నిట వేమ! ॥ 45 ॥

మదము వలన గలుగు మాటలు మఱిపల్కి
మ్రుచ్చు సద్దులనొగి మోసపుచ్చి
కాసురాబెనగెడు కష్ఠుణ్డు గురుడౌనే?
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 46 ॥

మనసే మాయా మృగమౌ
మననేమిటి పైకిగానీ మణిపోనీకా
మనసున మనసును జమ్పిన
మనన్దే ముక్తిగలదు మహిలో వేమ! ॥ 47 ॥

మన్త్రమొకటి చెప్పి మఱి దేవతార్చన
చేసి తమకుగరుణచెన్దినదని
వేదపఠన చేసి వెర్రులై పోదురు,
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 48 ॥

మఠములోనియోగి మాయలన్నియుగోసి
ఘటములోన నున్న ఘనునిదెలిసి
మాట మాటకుగురు మరువక తెలుపురా,
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 49 ॥

తిరిగి వచ్చువేళ మరలిపోయెడి వేళ
వెణ్ట దేరు ధనము వణ్టబోరు
తొనెటకు జనునొ ధనమెన్దు బోవునో
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 50 ॥

ఆశయనెడు దాని గోసివేయగాలేక
మొహబుద్ది వలన మునుగువారు
కాశివాసులైన గనబోరు మోక్షము
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 51 ॥

చిత్తమనేడి వేరే శిథిలమైనప్పుడే
ప్రకృతి యనెడి చెట్టు పడును పిదప
గోర్కులనెడి పెద్దకొమ్మలెణ్డును గదా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 52 ॥

భోగమ్బుల కాశిమ్పక
రాగద్వేషమ్బు రఙ్గుడదమలో
వేగమె మోక్ష పదమ్బును
రాగను నాతణ్డు యోగిరాయుడు వేమ! ॥ 53 ॥

చనువారెల్లను జనులం
జనిపోయిన వారి పుణ్య సత్కథలెల్లన్
వినవలె గనవలె మనవలె
నని మషులకు దెలుసగూడ దన్త్యము వేమ! ॥ 54 ॥

ఆశయనెడి త్రాళ్ళ నఖిల జనమ్బులు
కట్టుపడుచు ముక్తిగానరైరి
జ్ఞానఖడ్గమునను ఖణ్డిమ్ప రాదొకో
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 55 ॥

అతిథి రాక చూచి యదలిఞ్చి పడవైచి
కఠిన చితులగుచు గానలేరు
కర్మమునకు మున్దు ధర్మము గానరో
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 56 ॥

తను వలచిన దావలచును తను
వలవక యున్ననెనడు తావలవ డిలన్
తనదు పటాటోపమ్బులు తన
మాయలు పనికిరావు ధరలోన వేమ! ॥ 57 ॥

మాటలాడ వచ్చు మనసు నిల్వగలేదు
తెలుపవచ్చు దన్ను తెలియలేదు
సురియబట్టవచ్చు శూరుడు కాలేడు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 58 ॥

తనకేనాడు సుభిక్షము
తనకేనాడును భగమ్బు తనరవయునం
చును తన దశకై యెల్లెడ
మనసన్దున జివుకుచుణ్డు మహిలో వేమ! ॥ 59 ॥

ఎణ్డిన మా నొకటడవిని
మణ్డిన నన్దగ్ని పుట్టి యూడ్చును చెట్లన్
దణ్డిగల వంశమెల్లను
చణ్డాలుణ్డొకడు పుట్టి చదుపును వేమ! ॥ 60 ॥

నిజము తెలిసియున్న సుజినుడానిజమునె
పలుకవలయుగాని పరులకొరకు
చావకూడ దిఙ్క నోపదవ్యం పల్క
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 61 ॥

తామును జనులేమను కొన
బూనుదురో దాని సరసి పొన్దిన జడనీ,
రాని పధమ్బున నడిచిన
దాననె ధర్మాత్ముడణ్డ్రు తన్నిట వేమ! ॥ 62 ॥

వినియు వినకయుణ్డు కనియు గనక యుణ్డు
తలచి తలపకుణ్డు తాను యోగి
మనుజవరులచేత మణిపూజ గొనుచుణ్డు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 63 ॥

వెన్న చేతబట్టి వివరమ్బు తెలియక
ఘృతము కోరునట్టి యతని భణ్డి
తాను దైవమయ్యు దైవమ్బు దలచును
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 64 ॥

రూపువఙ్క పేరు రూఢిగా నిలుచును
పేరువఙ్క క్రియలు పెనగుచుణ్డు
నాశమౌను తుదకు నామరూప క్రియల్
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 65 ॥

లోభమోహములను ప్రాభవములు తప్పు
తలచిన పనులెల్ల తప్పి చనును
తానొకటి దలచిన దైవమొణ్డగుచుణ్డు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 66 ॥

శాన్తమే జనులను జయమునొన్దిఞ్చును
శాన్తముననె గురువు జాడ తెలియు
శాన్త భావ మహిమ జర్చిమ్పలేమయా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 67 ॥

వేషధారినెపుడు విశ్వసిమ్పగరాదు
వేషదోషములొక విధయె యగును
రట్టుకాదె మునుపు రావణు వేషమ్బు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 68 ॥

ఇఙ్గలమ్బు తోడ నిల సల్పుతోడను
పరుని యాలితోడ పతితుతోడ
సరసమాడుటెల్ల చావుకు మూలము
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 69 ॥

ఐకమత్యమొక్క టావశ్యకం బెప్డు
దాని బలిమి నెన్తయైన గూడు
గడ్డి వెణ్ట బెట్టి కట్టరా యేనుఙ్గు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 70 ॥

తామసిఞ్చి చేయదగదెట్టి కార్యమ్బు
వేగిరిమ్ప నదియు విషమగును
పచ్చికాయదెచ్చి పడవేయ ఫలమౌనా?
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 71 ॥

తల్లీ బిడ్డలకు తగవు పుట్టిఞ్చెడి
ధనము సుఖము గూర్చునని గడిన్త్రు
కానీయెల్ల యెడల ఘన దుఃఖకరమది
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 72 ॥

దొఙ్గమాటలాడ దొరుకునె మోక్షము
చేతగాని పలుకు చేటుదెచ్చు
గురువుపద్దు కాదు గునహైన్య మదియగు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 73 ॥

నలుగురు కల చోటను దా
దల చూపుచు మెలగుచుణ్డి ధన్యాత గనగా
దలచెడి యాతడు నిచ్చలు
గల మాటలే పలుకుచుణ్డగా దగు వేమ! ॥ 74 ॥

నడుచునిచ్చు నతని బత్తెమిచ్చిన వాని
కడుపు చల్లజేసి ఘనత విడుచు
నడుప నేర నేర నతడు నాలి ముచ్చేగదా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 75 ॥

పదుగురాడుమాట పాడియై ధరజెల్లు
నొక్కడాడుమాట యెక్కదెన్దు
వూరకుణ్డు వాని కూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 76 ॥

పతక మన్దు నొప్పు పలు రత్నముల పెమ్పు
బఙ్గరన్దు కూర్ప బరువు గనును
గాని యితర లోహమైన హీనము గాదె
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 77 ॥

జన్నములను మరియు జన్నియల ననేక
ముల నొనర్చియున్న ఫలముకాన
రాక యుణ్డు నీతి లేకున్న మాత్రాన
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 78 ॥

తప్పు పలుకు పలికి తాతోట చేసిన
కూడియున లక్ష్మీ క్రుఙ్గిపోవు
నోటికుణ్డ నీళ్ళు నొనరగా నిలుచునా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 79 ॥

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుँ జూచి ధనము నవ్వు
కదన భీతుँ జూచి కాలుँడు నవ్వును
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 80 ॥

నీతి జ్యోతిలేక నిర్మలమ్బగు నేది
ఎట్లు కలగుబర మదెన్తయైన
ధనము గలిగియున్న దైవమ్బు గలుగదు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 81 ॥

పగయుడగు గోపముడిగిన
పగయుడుగన్​ కోర్కెలుడుగు బరజన్మమ్పుం
దగులుడుగు భేదముడిగిన
త్రిగుణము లుడుగఙ్గ ముక్తి స్థిరమగు వేమ! ॥ 82 ॥

పప్పులేని కూడు పరులకోసహ్యమే
యుప్పులేని వాడె యధిక బలుడు
ముప్పులేని వాడు మొదటి సుజ్జానిరా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 83 ॥

నిక్కమైన మఞ్చి నీలమొక్కటి చాలు
తళుకు బెళుకు రాలు తట్టెడేల
చదువ పద్యమరయ జాలదా యొక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 84 ॥

పరుల దత్తమొప్పి పాలనచేసిన
నిల స్వదత్తమునకు విను మడియగు
నవని పరుల దత్త మహపరిమ్పగ రాదు
విశ్వధాబిరామ వినుర వేమ! ॥ 85 ॥

నిజములాడు వాని నిన్దిఞ్చు జగమెల్ల
నిజము బల్కరాదు నీచులకడ
నిజ మహాత్ముగూడ నిజమాడవలయురా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 86 ॥

పదుగురాడుమాట పాడియై ధరజెల్లు
నొక్కడాడుమాట యెక్కదెన్దు
వూరకుణ్డు వాని కూరెల్ల నోపదు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 87 ॥

పరుల మేలు చూచి పలుగాకి వలె నెప్పు
వట్టి మాటలాడు వాడధముడు
అట్టి వాని బ్రతుకు టదియేల మణ్టికా
విశ్వధాబిరామ వినుర వేమ! ॥ 88 ॥

భయమన్తయు దేహమునకె
భయ ముడిగిన నిశ్చయమ్బు పరమాత్మునకే
లయమన్తయు జీవునకే
జయమాత్మకు ననుచు జగతిँ జాటుర వేమ! ॥ 89 ॥

భూమి నాది యనిన భూమి ఫక్కున నవ్వు
దాన హీనుँ జూచి ధనము నవ్వు
కదన భీతుँ జూచి కాలుँడు నవ్వును
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 90 ॥

మాటజెప్ప వినని మనుజుడు మూర్ఖుడు
మాట విన్న నరుడు మానుడగును
మాట వినగ జెప్ప మానుట కూడదు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 91 ॥

మనసు తెలిసి యొకని మాటకు బ్రతిచెప్ప
సన్తసిఞ్చు నతడు చాలమెచ్చు
మనసు దెలియకున్నడనియుచు ననునేదో
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 92 ॥

ఆలిమాటలు విని అన్నదమ్ముల రోసి
వేరేపోవువాడు వెర్రివాడు
కుక్కతోక పట్టి గోదారీదినా?
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 93 ॥

జ్ఞానియైనవాని మానక పూజిఞ్చు
మనుజుడెప్పుడు పరమునను ముదమ్బు
సుఖమునన్దుచుణ్డుసూరులు మెచ్చగ
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 94 ॥

హాని కలుగబోదు హరిమది నెఞ్చెడు
వాని కబ్దు పరము వసుధయన్దు
పూని నిష్ఠమీరి పొదలక యుణ్డుము
విశ్వరాభిరామ వినుర వేమ! ॥ 95 ॥

అల్పుడెప్పుడు పలుకు నాడమ్బరముగాను
సజ్జనుణ్డు పలుకు చల్లగాను
కఞ్చు మోగినట్లు కనకమ్బు మోగునా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 96 ॥

న్యాయశాస్త్ర మరయ నన్యాయమున దిఞ్చు
ధర్మశాస్త్ర మొసగు రుగ్మతమ్బు
జ్యోతిషము జనముల నీతుల దప్పిఞ్చు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 97 ॥

దేవుడనగ వేరే దేశమున్దున్నాడె
దేహితోడ నెపుడు దేహమన్దె
వాహనములనెక్కి పడిదోలుచున్నాడు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 98 ॥

భూమిలోన బుట్టు భూసారమెల్లను
తనువులోన బుట్టు తత్త్వమెల్ల
శ్రమలోన బుట్టు సర్వమ్బు తానౌను
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 99 ॥

వ్రాతకణ్టె హెచ్చు పరమీదు దైవమ్బు
చేతకణ్టె హెచ్చు వ్రాత లేదు
వ్రాత కజుడు కర్త చేతకు దాకర్త
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 100 ॥

చిప్పలోనబడ్డ చినుకు ముత్యమ్బయ్యె
నీట బడ్డ చినుకు నీట గలిసె
బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 101 ॥

ఇణ్టి ఇణ్టిలోననీశ్వరుడుణ్డగ
నణ్టి చూడలేక యడవులన్దు
నుణ్ట మేటఞ్చునున్దురా జోగులై
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 102 ॥

చిత్తశుద్ధి కలిగిచేసిన పుణ్యమ్బు
కొఞ్చెమైన నదియు కొదవగాదు
విత్తనమ్బు మర్రి వృక్షమ్బునకు నెన్తో
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 103 ॥

అగ్నిబానా మేసి యమ్బుధి నిఙ్కిఞ్చు
రాముడవలి కేగ రాక, నిలిచి
చెట్లు గిరులు తెచ్చి సేతువు గట్టడా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 104 ॥

ఐదు వేళ్లు బలిమి హస్తమ్బు పనిచేయు
నం దొకణ్డు విడ్డ పొన్దు చెడును
స్వీయుడొకడు విడిన జెడుకదా పనిబల్మి
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 105 ॥

ఆత్మబుద్ధి వలన నఖిలమ్బ తానయ్యె
జీవబుద్ధి వలన జీవుడయ్యె
మోహబుద్ధిలయము మున్దర గనుగొను
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 106 ॥

గుణములోగలవాని కులమెఞ్చగానేల
గుణము కలిగెనేని కోటిసేయు
గణములేక యున్న గుడ్డిగవ్వయులేదు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 107 ॥

తల్లితణ్డ్రులన్దు దయలేని పుత్రుణ్డు
పుట్టనేమి? వాడు గిట్టనేమి?
పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 108 ॥

కోపమున ఘనత కొఞ్చెమైపోవును
కోపమునను గుణము కొరతపడును
కోపమణచనేని కోరికలీడేరు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 109 ॥

ఎలుగు తోలు తెచ్చి ఏడాది యుతికినా
నలుపు నలుపేకాని తెలుపుకాదు
కొయ్యబొమ్మ తెచ్చి కొట్టితే గుణియోనె
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 110 ॥

అల్పబుద్ధివానికధికారమిచ్చిన
దొడ్డవారినెల్ల తొలగగొట్టు
చెప్పుదినెడు కుక్క చెరకు తీపెరుగునా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 111 ॥

పట్టుపట్టరాదు పట్టివిడువరాదు
పట్టెనేని బిగియ పట్టవలయు
పట్టువిడుటకన్నా పడిచచ్చుటేమేలు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 112 ॥

తుమ్మచెట్టు ముణ్డ్ల తోడనేపుట్టును
విత్తులొననుణ్డు వెడలునట్లు
మూర్ఖునకును బుద్ధి మున్దుగా బుట్టను
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 113 ॥

కపటి వేషమూని కడగణ్డ్లు పడనేల
విపిన భూమి తిరిగి విసుగనేల
యుపముతోనే ముక్తి ఉన్నది చూడరా
విశ్వదాభి రామ వినుర వేమ ॥ 114 ॥

అనువుగాని చోట అధికులమనరాదు
కొఞ్చెమున్దుటెల్ల కొదువకాదు
కొణ్డ యద్దమన్దు కొఞ్చమై ఉణ్డదా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 115 ॥

మనసులోనున్న మర్మమన్త ఎరిగి
స్థిరము చేసి ఆత్మ తేటపరిచి
ఘటము నిల్పవలయు, ఘనతలిఙ్కేటికి
విశ్వదాభి రామవినుర వేమ! ॥ 116 ॥

కదలనీయకుణ్డ గట్టిగా లిఙ్గమ్బు
కట్టివేయనేమి ఘనత కలుగు
భావమన్దు శివుని భావిఞ్చి కానరా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 117 ॥

మేక జఙ్కబెట్టిమెలగుచు మన్దలో
బ్రమని తిరుగు గొల్ల పగిదిగాను
దేవునెరుగక పరదవేతల దలచు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 118 ॥

తన కుల గోత్రము లాకృతి
తన సమ్పద కలిమి బలిమి తనకేలనయా?
తన వెణ్టరావు నిజమిది
తన సత్యమే తోడువచ్చు తనతో
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 119 ॥

కలిమిగల్గనేమి కరుణ లేకుణ్డిన
కలిమి తగునె దుష్టకర్ములకును
తేనెగూర్పనీగ తెరువున బోవదా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 120 ॥

ఎణ్డిన మానొకటడవిని
మణ్డిన నన్దగ్ని పుట్టి యూడ్చును చెట్లన్
దణ్డిగల వంశమెల్లను
చణ్డాలుణ్డొకడు పుట్టి చదువును వేమ! ॥ 121 ॥

కనులు పోవువాడు కాళ్లు పోయినవాడు
ఉభయులరయుగూడి యుణ్డినట్లు
పేద పేద గూడి పెనగొని యుణ్డును
విశ్వదాభిరామా వినుర వేమ! ॥ 122 ॥

మాటలాడు గల్గు మర్మములెరిగిన
పిన్నపెద్దతనము లెన్నవలదు
పిన్నచేతి దివ్వె పెద్దగా వెలగదా?
విశ్వధాభిరామ వినుర వేమ! ॥ 123 ॥

కొణ్డముచ్చు పెణ్డ్లికి కోతి పేరణ్టాలు
మొణ్డి వాని హితుడు బణ్డవాడు
దుణ్డగీడునకును కొణ్డెడు దళవాయి
విశ్వదాభిరామా వినుర వేమ! ॥ 124 ॥

ఝుషము నీరు వెడల జచ్చుటే సిద్ధము
నీటనుణ్డనేని నిక్కిపడును
అణ్డతొలుగు నెడల నన్దర పని అట్లే
విశ్వదాభి రామ వినుర వేమ! ॥ 125 ॥

తల్లియేడ్వ వినక తనయాలు వగచిన
జాలిపడెడు వాడు జడుడు సుమ్మి
తారతమ్య మెరుగనేరని పశువది
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 126 ॥

పరులమేలు చూసి పలుకాకి వలె
వట్టిమాటలాడు వాడు అధముడు
అట్టివాని బతుకుటది ఏల మణ్టికా?
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 127 ॥

గఙ్గి గోవుపాలు గరిటడైనను చాలు
కడవెడైనను నేమి ఖరముపాలు
భక్తికల్గుకూడు పట్టెడైనను చాలు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 128 ॥

చిక్కియున్నవేళ సింహమ్బునైనను
బక్క కుక్కయైనా బాధసేయు
బలిమిలేని వేళ పన్తములు చెల్లవు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 129 ॥

పనసతొనలకన్న పఞ్చదారలకన్న
జుణ్టితేనెకన్న జున్నుకన్న
చెఱుకు రసముకన్న చెలుల మాటలె తీపి
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 130 ॥

నిణ్డునదులు పారు నిలచి గమ్భీరమై
వెఱ్రివాగు పాఱు వేగబొర్లి
అల్పుడాడురీతి నధికుణ్డు నాడునా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 131 ॥

ఉప్పులేనికూర యొప్పదు రుచులకు
పప్పులేని తిణ్డి ఫలములేదు
అప్పులేనివాడె యధిక సమ్పన్నుడు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 132 ॥

పసుల వన్నె వేరు పాలెల్ల ఒక్కటి
పుష్పజాతి వేరు పూజ ఒకటి
దర్శనమ్బులారు దైవమ్బు ఒక్కటి
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 133 ॥

చమ్పదగిన శతృవు తనచేత
చిక్కెనేని కీడు చేయరాదు
పొసగ మేలు చేసి పొమ్మనుటే మేలు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 134 ॥

ఆపదగల వేళ అరసి బన్ధువు జూడు
భయము వేళ జూడు బణ్టుతనము
పేదవేళ జూడు పెణ్డ్లాము గుణము
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 135 ॥

ఉప్పు కప్పురమ్బు ఒక్క పోలికనుణ్డు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులన్దు పుణ్య పురుషులు వేరయ
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 136 ॥

ఆత్మ శుద్ది లేని యాచారమదియేల
భాణ్డశుద్ది లేని పాక మేల
చిత్తశుద్దిలేని శివపూజలేలరా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 137 ॥

యినుము విరగనేని యినుమూరు ముమ్మారు
కాచియెతకవచ్చు గ్రమము గాను
మనసు విరిగెనేని మరి చేర్చరాదయా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 138 ॥

కుణ్డ కుమ్భమన్న కొణ్డ పర్వతమన్న
నుప్పు లవణమన్న నొకటి కాదె
భాష లిట్టె వేరు పరతత్వమొకటె
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 139 ॥

అనగ ననగ రాగ మతిశ యిల్లుచునుణ్డు
దినగ దినగ వేము తియ్యనుణ్డు
సాధనమున పనులు సమకూరు ధరలోన
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 140 ॥

చెప్పులోని రాయి చెవిలోని జోరీగ
కణ్టిలోని నలుసు కాలి ముల్లు
ఇణ్టిలోని పోరు నిన్తిన్త గాదయా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 141 ॥

తప్పు లెన్నువారు తణ్డోప తణ్డమ్బు
లుర్వి జనులకెల్ల నుణ్డు తప్పు
తప్పు లెన్నువారు తమ తప్పులెరుగరు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 142 ॥

మిరప గిఞ్జ చూడ మీద నల్లగనుణ్డు
కొరికి జూడలోన జురుకుమనును
సజ్జను లగు వారి సార మిట్లుణ్డు
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 143 ॥

మేడిపణ్డు చూడ మేలిమై యుణ్డును
పొట్టవిచ్చి చూడ పురుగులుణ్డు
పిరికివాని మదిని బిఙ్కమీలాగురా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 144 ॥

వేరు పురుగు చేరి వృక్షమ్బు జెరుచును
చీడపురుగు చేరి చెట్టు జెరచు
కుత్సితుణ్డు చేరి గుణవన్తు జెరచురా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 145 ॥

వేషభాష లెరిగి కాషయవస్త్రముల్
గట్టగానె ముక్తి గలుగబోదు
తలలు బోడులృన తలపులూ బోడూలా
విశ్వదాభిరామ వినుర వేమ! ॥ 146 ॥




Browse Related Categories: