ఓం నమో భగవతే శ్రీ రమణాయ
అరుణాచల అక్షర-మణిమాల
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల మనుచు స్మరియిఞ్చువారల అహము నిర్మూలిమ్పు అరుణాచలా
అళగు సున్దరముల వలె చేరి నేను నీ వున్దమభిన్నమై అరుణాచలా
లోదూరి లాగి నీ లోగుహను చెరగా అనుమరిఞ్చి తేమొకో అరుణాచలా
ఎవరికిగా నన్ను ఏలితి విడిచిన అఖిలము నిన్దిఞ్చు అరుణాచలా
ఈ నిన్ద తప్పు నిన్నేటికి దలపిఞ్చితిక విడువారెవరరు అరుణాచలా
కనిన జనని కన్న ఘనదయాదాయకా ఇదియా యనుగ్రహము అరుణాచలా
నిన్నేమార్చి యరుగనీక యుల్లము పైని నురుదిగా నుణ్డుమా అరుణాచలా
ఊరూరు తిరుగక యుల్లము నిను గని యణగ నీ ద్యుతి జూపుము అరుణాచలా
నను చెరచి యిపుడు నను కలియక విడుటిది మగతన మొక్కొయా అరుణాచలా
ఏటి కీ నిదుర నన్నితరులు లాగగ ఇది నీకు న్యాయమా అరుణాచలా
పఞ్చేన్ద్రియ ఖలులు మదిలోన దూరుచో మదిని నీవున్దవో అరుణాచలా
ఒకడవౌ నిను మాయ మొనరిఞ్చి వచ్చువారెవరిది నీ జాలము అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
ఓఙ్కార వాక్యార్ధ యుత్తమ సమహీన నిన్నెవరెరుగువారు అరుణాచలా
అవ్వబోలె నొసగి నాకు నీ కరుణ నన్నేలుట నీ భారము అరుణాచలా
కన్నుకు గన్నయి కన్నులేక కను నిను కనువారెవరుగనుము అరుణాచలా
ఇనుము ఆయస్కాన్తము వలె గవిసి నను విడువక కలసి నాతోనుణ్డుము అరుణాచలా
గిరి రూప మైనట్టి కరుణా సముద్రమా కృప చేసి నన్నేలుం అరుణాచలా
క్రిన్ద మీదెటను చెన్నొన్దు కిరణమణి నా క్రిన్దు గతి మాపు అరుణాచలా
కుట్ర యన్తయు గోసి గుణముగ బాలిఞ్చు గురు రూపమై వెలుగు అరుణాచలా
కూచి వాల్గన్నుల కోతబడక కృప చేసి నన్ చేరి కావుం అరుణాచలా
వఞ్చకా వేడియున్ గొఞ్చెమున్ గరగవే అభయ మఞ్చేలుమా అరుణాచలా
అడుగకిచ్చెడు నీదు నకళఙ్క మగు కీర్తి హాని సేయక బ్రోవు అరుణాచలా
హస్తలమలక నీదు సద్రసమున సుఖోన్మాద మొన్దగ నేలు అరుణాచలా
వల నుఞ్చి భక్తుల పరిమార్చు నిను గట్టుకొని యెట్లు జీవిన్తును అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
కోపరహిత గుణ గురిగాగ నను గొను కొరయేమి చేసితి అరుణాచలా
గౌతమ పూజిత కరుణా ఘన నగమా కడ గణ్ట ఏలుమా అరుణాచలా
సకలము కబళిఞ్చు కరకాన్తియిన మనో జలజ మరల్పుమా అరుణాచలా
తిణ్డిని నిన్జేరితిని తిన నా నేను శాన్తమై పోవుదును అరుణాచలా
మది చల్లపడ భద్రకర ముఞ్చి యమృతనోర్ తెరు మనుగ్రహచన్ద్ర అరుణాచలా
వన్నెను చెరచి నిర్వాణ మొనర్చి కృపావన్నె నిడి బ్రోవుమరుణాచలా
సుఖ సముద్రము పొఙ్గ వాక్ మనమ్ములడఙ్గ నూరక నమరు మన్దరుణాచలా
వఞ్చిన్తువేల నన్ శోధిమ్పకిక నీదు జ్యోతి రూపము చూపుం అరుణాచలా
పరవిద్య గరపి యీ భూమి మైకము వీడి రూపగు విద్య జూపు అరుణాచలా
చేరకున్నను మేను నీరుగ గరగి కన్నీటేరయి నశిన్తు అరుణాచలా
ఛీ యని ద్రోసిన చేయు కర్మ తపన గాకేది మను మారం అరుణాచలా
చెప్పక చెపి నీవు మౌనత నుణ్డని యూరక యున్దువే అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
సోమరి నైతిని మిన్నని సుఖ నిద్ర కన్న వేరెది గతి అరుణాచలా
శౌర్యము జూపితి శమియిఞ్చె నని మాయ చలియి0ప కున్నావు అరుణాచలా
కుక్కకు న్నీచమే నేనే గురుతుగొని వెదకి నిన్జేరుదు అరుణాచలా
జ్ఞానము లేక నీ యాస దైన్యము బాప జ్ఞానము దెల్పి బ్రోవుమరుణాచలా
తేటి వలెను నీవు వికసిమ్ప లేదని యెదుట నిలుతువేల అరుణాచలా
తత్వ మెరుగజాల నన్తయై నిలుతువే యిదియేమి తత్వమో అరుణాచలా
తా నేను తానను తత్వ మిద్దానిని తానుగా చూపిన్తు అరుణాచలా
త్రిప్పి యహన్తను నెప్పుడు లో ద్రుష్టి గన దెలియు ననునదే అరుణాచలా
తీరముణ్డని యెద వెదకియు నిన్ను నే తిరిగి పొన్దితి బ్రోవు మరుణాచలా
సత్య జ్ఞానము లేని యీ జన్మ ఫలమేమి యొప్పగ రావేల అరుణాచలా
శుద్ధ వాఙ్గ్మన యుతులం దోచు నీ నిజా హన్త గల్పి నను బ్రోవు అరుణాచలా
దైవ మనుచు నిన్ను దరిచేరగా నన్ను పూర్ణ నాశ మొనర్చితి అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచలా
వెదుకక గనిన సచ్చ్రీయనుగ్రహనిధి మది తెగుల్ తీర్చి బ్రోవు అరుణాచలా
ధైర్యము పరుగిడు నీ నిజహమరయ నే నాశమైతి బ్రోవు అరుణాచలా
తాకి కృపాకరము నను గలియకున్న నిజము నశిన్తు బ్రోవు అరుణాచలా
దోషరహిత నీవు నాతో నైక్యమయి నిత్యానన్ద మయమోనర్పరుణాచలా
నగకు నెడముకాదు నిన్వెదకిన నన్ను గను కృపానగ వేసి అరుణాచలా
నాన లేదె వెదుక నేనయి నీ వొణ్టి స్థాణువై నిలిచితివి అరుణాచలా
నీ జ్వాల గాల్చినన్ నీరు సేసెడు మున్నె నీ కృప వర్షిమ్పు అరుణాచలా
నీవు నే నణగ నిత్యానన్దమయముగా నిలుచు స్థితి కరుణి0పు అరుణాచలా
అణురూపు నిన్ను నే మిన్ను రూపుం చేర భావోర్ములెపుడాగు అరుణాచలా
సూత్ర జ్ఞానము లేని పామరు నా మాయా జ్ఞానము కోసికావు అరుణాచలా
మక్కి మక్కి కరగి నే నిన్ను శరణన్ద నగ్నుడవై నిల్చితి అరుణాచలా
నేస్తముణ్డని నాకు నీ యాశ చూపినన్ మోసగిమ్పక బ్రోవు అరుణాచలా
అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల