పాహిరామప్రభో పాహిరామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో
శ్రీమన్మహా గుణస్తోమమాభిరామమీనామ కీర్తనలు వర్ణిన్తురా రామప్రభో
ఇన్దిరాహృదయారవిన్దాధిరూఢ సున్దరాకార సానన్ద రామప్రభో
ఎన్దునేజూడ మీసున్దరానన్దమును కన్దునోకన్నులిమ్పపొద శ్రీరామప్రభో
పుణ్యచారిత్రలావణ్య కారుణ్యగామ్భీర్యదాక్షిణ్య శ్రీరామచన్ద్ర
కన్దర్పజనకనాయన్దురఞ్జలి సదానన్దుణ్డు వై పూజలన్దు రామప్రభో
ఇమ్పుగా జెవులకున్విన్దు గా నీకథల్ కన్దుగా మిమ్మి సొపొన్దరామప్రభో
వన్దనము చేసిమునులన్దరు ఘనులై రివిన్దలై నట్టిగోవిన్ద రామప్రభో
బృన్దార కాదిబృన్దార్చిత పదారవిన్దముల నీసన్దర్శితానన్ద రామప్రభో
తల్లివీనీవెమాతణ్డ్రివినీవె మదాతవునీవు మాభ్రతరామప్రభో
వల్లవాధరలైనగొల్ల భామలగూడి యుల్లమలరఙ్గరఞ్జిల్లి రామప్రభో
మల్లరఙ్గమ్బునన్దెల్ల మల్లులజీరియల్లకంసుని జమ్పుమల్ల రామప్రభో
కొల్లలుగనీమాయ వెల్లివిరియగ జేయునల్లపమున క్రీడసల్పు రామప్రభో
తమ్ముడునునీవు పార్శ్వమ్ములం జేరివిల్లమ్ము లెక్కడినిల్చురామప్రభో
క్రమ్ముకొని శాత్రువులుహుమ్మనుచు వచ్చెదరుఇమ్మెన బాణమ్ములిమ్ము రామప్రభో
రమ్మునాకిమ్మభయమ్ము నీపాదముల్ల్ నమ్మినానయ్య శ్రీరామచన్ద్ర ప్రభో
కణ్టిమీశఙ్ఖమ్ము కన్తీమీచక్రముకణ్టి మీపాదముల్గణ్టి రామప్రభో
విణ్టి మీమహిమా వెన్నణ్టి మీతమ్ముడునీవు జణ్టరావయ్య నావెణ్ట రామప్రభో
మేమునీవారమైనామైనామురక్షిమ్పు మన్నాముజాగేలశ్రీరామచన్ద్ర
నామనోవీధినినీప్రేమతో నుణ్డుమీభూమీజాసహితజయ రామప్రభో
మీమహత్వమువినన్న్ మనమ్బన్దు బ్రేమమ్బువేమరుబుట్టు శ్రీరామప్రభో
శ్యామలసున్దరఙ్కోమలఞ్జానకీ కాముకన్త్వమ్భజే రామచన్ద్ర ప్రభో
కామితార్ధములిచ్చు నీమహత్యమువిన్నా మోరాలిఞ్చు నాస్వామి రామప్రభో
కామితప్రభుడవై ప్రేమతోరక్షిఞ్చుస్వామి సాకేతపురి రామప్రభో
అన్నరావన్న నీకన్ననామిదనెవరన్నవారేరిరామన్న రామప్రభో
నిన్నెగాకనుమరియన్యులగాననన్ గన్నతణ్డ్రివిమాయన్న రామప్రభో
వెన్నదొఙ్గిలితిన్న చిన్న కృష్ణమ్మనిన్నెన్న గావశమెరామన్న రామప్రభో
ఎన్నెన్నోజన్మములనెత్తగాజాలని నిన్నెనమ్మితిని వర్ణిన్తు రామప్రభో
పన్నగాధిపశాయిభావనాగతఆపన్ననామనవి వినవన్న రామప్రభో
ఏటివాక్యమ్బుమీసాటిదైవమ్బుముమ్మాటికి భువిలేదుమేటి రామప్రభో
పాడుదున్మిమ్ము గొనియాడుదున్మోదమున వేడుచున్నాను గాపాడు రామప్రభో
వేడుకోగానె నీజోడుకాడను నీవుకూడిరారయ్యనాతోడ రామప్రభో
నేడునాకోర్కెలీడేరగాజేసి కాపాడరాకరినేలుజూడ రామప్రభో
మూడుమూర్తుల కాత్మమూలమై చెన్నొన్దినాడవని శత్రులున్నాడ రామప్రభో
చూడమీభక్తులనుగూడమీరిపులగో రాడుమీవల్లగోవిన్ద రామప్రభో
పుణ్డరీకాక్షమార్తాణ్డ వంశోద్భవాఖణ్డలస్తుత్యకోదణ్డ రామప్రభో
కుణ్డలీశయనభూమణ్డలోద్ధరణ పాషాణ్డజనహరణకోదణ్డ రామప్రభో
నిణ్డుదయతోడనాయణ్డబాయకను నీవుణ్డిగాపాడు కోదణ్డ రామప్రభో
జాతకౌతూహలం సేతుకృత్వారమా పూతసీతాపతేదాత రామప్రభో
పాతకులలో మొదటిపాతుకుడ నావణ్టి పాతుకుని కాచూటే ఖ్యాతి రామప్రభో
భూతనాధునివిల్లుఖ్యాతిగాఖణ్డిఞ్చిసీత గైకొన్నవిఖ్యాతి రామప్రభో
పూతనాకల్మషోద్ధూతపెన్ శత్రుసంహారిసీతాసమేతరామప్రభో
జాతినీతులు లేక భూతలమ్బునదిరుగుఘాతకులబరిమార్చు నేత రామప్రభో
ఎప్పుడున్ గణ్టికిన్ రెప్పవలెగాచిననొప్పుగాగావుమాయప్ప రామప్రభో
ఏదయానీదయాయోదయామ్భోనిధియాది లేదయ్యనామీద రామప్రభో
ఘోరరాక్షస గర్వహరవిశ్వమ్భరోదారవిస్తార గుణసాన్ద్ర రామప్రభో
మోదముననీవునన్నాదుకోవయ్య గోదావరీతీర భద్రాద్రి రామప్రభో
నీదుబాణమ్బులను నాదుశత్రుబట్టిబాధిమ్పకున్నానదేమి రామప్రభో
ఆదిమధ్యాన్త బహిరన్తరాత్ముణ్డనుచువాదిన్తునే జగన్నాథ
చాలదేమిపదాబ్జాతముల సాటిపదునాల్గులోకమ్బులుగూడి రామప్రభో
ఏలయీలాగుగేలజేసేదు మమ్మేలుకోవయ్య మాపాలిరామప్రభో
పాలువెన్నలుమ్రుచ్చిలిఞ్చయశోదరోల గట్టినమాయజాల రామప్రభో
కొల్లలుగవ్రేపల్లెపల్లవాధురులతో నల్లిబల్లిగనురఞ్జిల్లు రామప్రభో
వాలి నొక్కమ్మున గూలినేసిన శౌర్యశాలియోనినుదలతుజాల
సాలభఞ్జికలనిర్మూలమ్బుచేయగాజాలితివి గోపాలబాల రామప్రభో
తాళవృక్షమునొక్కకోల ధరగూలఙ్గదూలనేసిన బహుశాలి
శిలయైనయహల్య శ్రీపాదములుసోకనొలతయైమిముదలచెరా
విననయ్య మనవి గైకొనవయ్య తప్పులన్ గనకయ్య సమ్మతిఙ్గొనుచు రామప్రభో
దానధర్మమ్బులుదపజపమ్బులు నీదునామకీర్తనకుసరికావు రామప్రభో
మానావమానములు మహిని నీవైయుణ్డగనీయెడనుణ్డమాకేల
జ్ఞానయోగభ్యాసమన్దునుణ్డెడివారి కానన్దమయుడవైనావు
అణురేణుపరిపూర్ణడౌహృదివానిగామనవి విను దేవకీతనయ రామప్రభో
మాస్యమై యాశ్రిత్ర వదాన్యమై సుజనసన్మోదమై వెలుగు మూర్ధన్య రామప్రభో
నిత్యమైసత్యమైనిర్మలమ్బై మహిని దివ్యవంశోత్తంసమైన రామప్రభో
సేద్యమైమీకధల్భావ్యమై సజ్జన శ్రావ్యమైయుణ్డునోదివ్య రామప్రభో
గట్టిగానన్ను నీవుపట్టుగావిహితమౌపట్టుగామమ్ముచేపట్టు రామప్రభో