View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

తారక మన్త్రము

రాగమ్: ధన్యాసి
తాళమ్: ఆది

తారక మన్త్రము కోరిన దొరికెను
ధన్యుడనైతిని ఓరన్నా ॥ పల్లవి ॥

మీరిన కాలుని దూతలపాలిటి
మృత్యువుయని మదినమ్ముక యున్న ॥ అనుపల్లవి ॥ తారక మన్త్రము ॥

మచ్చికతో నితరాన్తరమ్ముల మాయలలో పడబోకన్నా
హెచ్చుగ నూటయెనిమిది తిరుపతులెలమి తిరుగపనిలేదన్నా
ముచ్చటగా తా పుణ్యనదులలో మునుగుట పనియేమిటికన్నా
వచ్చెడి పరువపు దినములలో సుడిపడుటలు మానకయు ॥ 1 ॥ తారక మన్త్రము ॥

ఎన్నిజన్మములనుణ్డి చూచినను ఏకోనారాయణుడన్న
అన్ని రూపులై యున్న నాపరాత్పరు నామహాత్ముని కథ విన్నా
ఎన్ని జన్మములజేసిన పాపములీ జన్మముతో విడునన్నా
అన్నిటికిది కడసారి జన్మము సత్యమ్బిక పుట్టుట సున్నా ॥ 2 ॥ తారక మన్త్రము ॥

నిర్మల మన్తర్లక్ష్యభావమున నిత్యానన్దముతోనున్న
కర్మమ్బులువిడి మోక్షపద్ధతిని కన్నుల నే జూచుచునున్న
ధర్మము తప్పక భద్రాద్రీశుని తన మదిలో నమ్ముకయున్న
మర్మము దెలిసిన రామదాసుని హృన్మన్దిరముననే యున్న ॥ 3 ॥ తారక మన్త్రము ॥




Browse Related Categories: