రామ లాలీ మేఘశ్యామ లాలీ
రామ లాలీ మేఘశ్యామ లాలీ తామరసా నయన దశరథ తనయ లాలీ ॥
అచ్చావదన ఆటలాడి అలసినావురా బొజ్జలోపలరిగెదాక నిదురపోవరా ॥
జోల పాడి జోకొట్టితె ఆలకిఞ్చెవు చాలిఞ్చమరి ఊరుకుణ్టే సఞ్జ్ఞ చేసేవు ॥
ఎన్తో ఎత్తు మరిగినావు ఏమి సేతురా ఇన్తుల చేతుల కాకలకు ఎన్తో కన్దేవు ॥
Browse Related Categories: