కూర్పు: శ్రీ త్యాగరాజాచార్యులు
రాగం: గౌళ
తాళం: ఆది
దుడుకు గల నన్నే దొర
కొడుకు బ్రోచురా ఎన్తో
దుడుకు గల నన్నే దొర
కడు దుర్విషయాకృశ్టుడై గడియ గడియకు నిణ్డారు
దుడుకు గల నన్నే దొర
శ్రీ వనితా హృత్కుముదాబ్జ వాఙ్గ్మానసాగోచర
దుడుకు గల నన్నే దొర
సకల భూతముల యన్దు నీవై యుణ్డగ మదిలేక పోయిన
దుడుకు గల నన్నే దొర
చిరుత ప్రాయమున నాడే భజనామృత రసవిహీన కుతర్కుడైన
దుడుకు గల నన్నే దొర
పర ధనముల కొరకు నొరుల మదిని
కరగబలికి కడుపు నిమ్ప దిరిగినట్టి
దుడుకు గల నన్నే దొర
తనమదిని భువిని సౌఖ్యపు జీవనమే
యనుచు సదా దినములు గడిపెడి
దుడుకు గల నన్నే దొర
తెలియని నటవిట క్షుద్రులు వనితలు స్వవశమౌట కుపదశిఞ్చి
సన్తసిల్లి స్వరలయమ్బు లెరుఙ్గకను శిలాత్ముడై
సుభక్తులకు సమానమను
దుడుకు గల నన్నే దొర
దృష్టికి సారమ్బగు లలనా సదనార్భక సేనామిత ధనాదులను
దేవాది దేవ నెరనమ్మితిని గాకను పదాబ్జ భజనమ్బు మరచిన
దుడుకు గల నన్నే దొర
చక్కని ముఖ కమలమ్బునను సదా నా మదిలో స్మరణ లేకనే
దుర్మదాన్ధ జనుల కోరి పరితాపములచే దగిలి నొగిలి దుర్విషయ
దురాశలను రోయలేక సతత మపరాధినై చపల చిత్తుడైన
దుడుకు గల నన్నే దొర
మానవతను దుర్లభ మనుచు నెఞ్చి పరమానన్ద మొన్దలేక
మద మత్సర కామ లోభ మోహములకు దాసుడై మోసబోతి గాక
మొదటి కులజుడగుచు భువిని శూద్రుల పనులు సల్పుచునుణ్టిని గాక
నారాధములను రోయ సారహీన మతములను సాధిమ్ప తారుమారు
దుడుకు గల నన్నే దొర
సతులకై కొన్నాళ్ళాస్థికై సుతులకై కొన్నాళ్ళు
ధన తతులకై తిరిగితి నయ్య త్యాగరాజాప్త ఇటువణ్టి
దుడుకు గల నన్నే దొర కొడుకు బ్రోచురా ఎన్తో
దుడుకు గల నన్నే దొర
Browse Related Categories: