రాగం: నాదనామక్రియ/నాదనామక్రియ
15 మాయమాళవ గొవ్ళ జన్య
ఆ: స రి1 గ3 మ1 ప ద1 ని3
అవ: ని3 ద1 ప మ1 గ3 రి1 స ని3
తాళం: ఆది
పల్లవి
ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇనవంశోత్తమ రామా
నా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా ॥ ఏ తీరుగ ॥
చరణం 1
శ్రీ రఘు నన్దన సీతా రమణా, శ్రితజన పోషక రామా
కారుణ్యాలయ భక్త వరద నిను, కన్నది కానుపు రామా ॥ ఏ తీరుగ ॥
చరణం 2
క్రూరకర్మములు నేరక చేసితి, నేరములెఞ్చకు రామా
దారిద్ర్యము పరిహారము సేయవే, దైవ శిఖామణి రామా ॥ ఏ తీరుగ ॥
చరణం 3
వాసవనుత రామదాస పోషక వన్దన-మయోధ్య రామా
దాసార్చిత మాకభయ-మొసఙ్గవే దాశరథీ రఘురామా ॥ ఏ తీరుగ ॥
చరణం 4
గురుడవు నా మది దైవము నీవని గురుశాస్త్రమ్బులు రామా
గురుదైవమ్బని యెరుగక తిరిగెడు క్రూరుడనైతిని రామా ॥ ఏ తీరుగ ॥
చరణం 5
నిణ్డితి వీ వఖిలాణ్డ కోతి బ్రహ్మాణ్డములన్దున రామా
నిణ్డుగ మది నీ నామము దలచిన నిత్యానన్దము రామా ॥ ఏ తీరుగ ॥
చరణం 6
వాసవ కమల భవాసురవన్దిత వారధి బన్ధన రామా
భాసుర వర సద్గుణములు కల్గిన భద్రాద్రీశ్వర రామా ॥ ఏ తీరుగ ॥
చరణం 7
మురిపెముతో నా స్వామివి నేవని మున్దుగ తెల్పితి రామా
మరువక ఇక నభిమానమున్చు నే మరుగుజొఛితిని రామా ॥ ఏ తీరుగ ॥
ఏ తీరుగ నను దయ చూచెదవో, ఇనవంశోత్తమ రామా
నా తరమా భవ సాగరమీదను, నళిన దళేక్షణ రామా