View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

అన్నమయ్య కీర్తన అలరులు కురియగ


రాగం: ధీర శంకరాభరణం
ఆ: స రి2 గ3 మ1 ప ద2 ని3 స
అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స
తాళం: ఆది

పల్లవి
అలరులు గురియగ నాడెనదే ।
అలకల గులుకుల నలమేలుమంగ ॥ (2.5)

చరణం 1
అరవిరి సొబగుల నతివలు మెచ్చగ
అర తెర మరుగున నాడె నదే । (2)
వరుసగ పూర్వదు వాళపు తిరుపుల
హరి గరగింపుచు నలమేలుమంగ ॥ (2)
అలరులు గురియగ నాడెనదే ।
అలకల గులుకుల నలమేలుమంగ ॥ (ప.) (1.5)

చరణం 2
మట్టపు మలపుల మట్టెలకెలపుల
తట్టెడి నడపుల దాటెనదే । (2)
పెట్టిన వజ్రపు పెండెపు దళుకులు
అట్టిట్టు చిమ్ముచు నలమేలుమంగ ॥ (2)
అలరులు గురియగ నాడెనదే ।
అలకల గులుకుల నలమేలుమంగ ॥ (ప.) (1.5)

చరణం 3
చిందుల పాటల శిరిపొలయాటల
అందెల మ్రోతల నాడె నదే । (2)
కందువ తిరువెంకటపతి మెచ్చగ
అందపు తిరుపుల నలమేలుమంగ ॥ (2)
అలరులు గురియగ నాడెనదే ।
అలకల గులుకుల నలమేలుమంగ ॥ (ప.) (2.5)




Browse Related Categories: