అన్నమయ్య కీర్తన గరుడ గమన గరుడధ్వజ
రాగం: హిందోళం (20 నటభైరవి జన్య) ఆ: స గ2 మ1 ద1 ని2 స అవ: స ని2 ద1 మ1 గ2 స తాళం: రూపకం పల్లవి గరుడ గమన గరుడధ్వజ నరహరి నమోనమో నమో ॥ చరణం 1 కమలాపతి కమలనాభా కమలజ జన్మకారణిక । (2) కమలనయన కమలాప్తకుల నమోనమో హరి నమో నమో ॥ (2) గరుడ గమన గరుడధ్వజ .. (ప..) చరణం 2 జలధి బంధన జలధిశయన జలనిధి మధ్య జంతుకల । (2) జలధిజామాత జలధిగంభీర హలధర నమో హరి నమో ॥ (2) గరుడ గమన గరుడధ్వజ .. (ప..) చరణం 3 ఘనదివ్యరూప ఘనమహిమాంక ఘనఘనా ఘనకాయ వర్ణ । (2) అనఘ శ్రీవేంకటాధిపతేహం (2) నమో నమోహరి నమో నమో ॥ గరుడ గమన గరుడధ్వజ .. (ప..)
Browse Related Categories: