అన్నమయ్య కీర్తన పవనాత్మజ ఓ ఘనుడా
ఓ పవనాత్మజ ఓ ఘనుడా బాపు బాపనగా పరిగితిగా । ఓ హనుమంతుడ ఉదయాచల ని- ర్వాహక నిజ సర్వ ప్రబలా । దేహము మోచిన తెగువకు నిటువలె సాహస మిటువలె చాటితిగా ॥ ఓ రవి గ్రహణ ఓదనుజాంతక మారులేక మతి మలసితిగా । దారుణపు వినతా తనయాదులు గారవింప నిటు కలిగితిగా ॥ ఓ దశముఖ హర ఓ వేంకటపతి- పాదసరోరుహ పాలకుడా । ఈ దేహముతో ఇన్నిలోకములు నీదేహమెక్క నిలిచితిగా ॥
Browse Related Categories: