అన్నమయ్య కీర్తన కొలని దోపరికి
రాగం: యదుకుల కాంభోజి 28 హరికాంభోజి జన్య ఆ: స రి2 మ1 ప ద2 స అవ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స తాళం: ఆది పల్లవి కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు । కుల స్వామికిని గొబ్బిళ్ళో ॥ (2) చరణం 1 కొండ గొడుగుగా గోవుల గాచిన । కొండొక శిశువునకు గొబ్బిళ్ళో । (2) దండగంపు దైత్యుల కెల్లను తల । గుండు గండనికి గొబ్బిళ్ళో ॥ కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు ..(ప..) (2) చరణం 2 పాప విధుల శిశుపాలుని తిట్టుల । కోపగానికిని గొబ్బిళ్ళో । (2) యేపున కంసుని యిడుమల బెట్టిన । గోప బాలునికి గొబ్బిళ్ళో ॥ కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు ..(ప..) (2) చరణం 3 దండివైరులను తరిమిన దనుజుల । గుండె దిగులునకు గొబ్బిళ్ళో । (2) వెండిపైడి యగు వేంకట గిరిపై । కొండలయ్యకును గొబ్బిళ్ళో ॥ కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు ..(ప..) (2)
Browse Related Categories: