View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

అన్నమయ్య కీర్తన సతులాల చూడరే


రాగం: సాలన్గనాట
ఆ: స రి1 మ1 ప ద1 స
అవ: స ద1 ప గ3 రి1 స

పల్లవి
సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
సకలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు । (2)

చరణం 1
పుట్టేయపుడే చతుర్భుజాలు శంఖుచక్రాలు
యెట్టు ధరియించెనే యీ కృష్ణుడు । (2)
అట్టె కిరీటము నాభరణాలు ధరించి
యెట్ట నెదుట నున్నాడు యీ కృష్ణుడు ॥ (2)

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
సకలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు । (ప..)

చరణం 3
వచ్చి బ్రహ్మయు రుద్రుడు వాకిట నుతించగాను
యిచ్చగించి వినుచున్నా(డీకృష్ణుడు ।
ముచ్చటాడీ దేవకితో ముంచి వసుదేవునితో
హెచ్చినమహిమలతో యీ కృష్ణుడు ॥

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
సకలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు । (ప..)

చరణం 2
కొద దీర మరి నందగోపునకు యశోదకు
ఇదిగో తా బిడ్డాడాయె నీకృష్ణుడు । (2)
అదన శ్రీ వేంకటేశుడై యలమేల్మంగ(గూడి
యెదుటనే నిలుచున్నా డీకృష్ణుడు ॥

సతులాల చూడరే శ్రావణబహుళాష్టమి
సకలాయ నడురేయి గలిగె శ్రీకృషుడు । (ప..)




Browse Related Categories: