అన్నమయ్య కీర్తన భావము లోన
రాగం: దేసాక్షి / సుద్ద ధన్యాసి 22 ఖరహరప్రియ జన్య ఆ: స గ2 మ1 ప ని2 ప స అవ: స ని2 ప మ1 గ2 స తాళం: ఆది పల్లవి భావములోనా బాహ్యమునందును । గోవింద గోవిందయని కొలువవో మనసా ॥ (2.5) చరణం 1 హరి యవతారములే యఖిల దేవతలు హరి లోనివే బ్రహ్మాండంబులు । (2) హరి నామములే అన్ని మంత్రములు (2) హరి హరి హరి హరి యనవో మనసా ॥ (2) భావములోనా బాహ్యమునందును ..(ప..) (1.5) చరణం 2 విష్ణుని మహిమలే విహిత కర్మములు విష్ణుని పొగడెడి వేదంబులు । (2) విష్ణుడొక్కడే విశ్వాంతరాత్ముడు (2) విష్ణువు విష్ణువని వెదకవో మనసా ॥ (2) భావములోనా బాహ్యమునందును ..(ప..) (1.5) చరణం 3 అచ్యుతుడితడే ఆదియు నంత్యము అచ్యుతుడే యసురాంతకుడు । (2) అచ్యుతుడు శ్రీవేంకటాద్రి మీదనిదె (2) అచ్యుత యచ్యుత శరణనవో మనసా ॥ (2) భావములోనా బాహ్యమునందును గోవింద గోవిందయని కొలువవో మనసా ॥
Browse Related Categories: