View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

అన్నమయ్య కీర్తన జయ లక్ష్మి వర లక్ష్మి


రాగం: లలిత
ఆ: స రి1 గ3 మ1 ద1 ని3 స
అవ: స ని3 ద1 మ1 గ3 రి1 స
తాళం: రూపక

పల్లవి
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి । (2)
ప్రియురాలవై హరికి~మ బెరసితివమ్మా ॥ (2)

చరణం 1
పాలజలనిధిలోని పసనైనమీఀగడ (5)+(1)
మేలిమితామరలోని మించువాసన ।
నీలవర్ణునురముపై నిండిననిధానమవై (2)
యేలేవు లోకములు మమ్మేలవమ్మా ॥
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి । (ఫా..)

చరణం 2
చందురుతోడ~మ బుట్టిన సంపదలమెఱుఀగవో
కందువ బ్రహ్మల~మ గాచేకల్పవల్లి ।
అందినగోవిందునికి అండనే తోడునీడవై
వుందానవు మా​ఇంటనే వుండవమ్మా ॥
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి । (ఫా..)

చరణం 3
పదియారు వన్నెలతో బంగారు పతిమ (5)+(1)
చెదరని వేదముల చిగురుఀబోడి ।
యెదుట శ్రీవేంకటేశునిల్లాలవై నీవు
నిదుల నిలిచేతల్లి నీవారమమ్మా ॥
జయలక్ష్మి వరలక్ష్మి సంగ్రామ వీరలక్ష్మి । (ఫా..)
ప్రియురాలవై హరికి~మ బెరసితివమ్మా ॥ (2)




Browse Related Categories: