అన్నమయ్య కీర్తన జయ జయ రామా
రాగం: నాట ఆ: స రి3 గ3 మ1 ప ద3 ని3 స అవ: స ని3 ప మ1 రి3 స తాళం: ఆది పల్లవి జయ జయ రామా సమరవిజయ రామా । భయహర నిజభక్తపారీణ రామా ॥ (2.5) చరణం 1 జలధి బంధించిన సౌమిత్రిరామా సెలవిల్లు విరచిన సీతారామా । (2) అలసుగ్రీవునేలి-నాయోధ్యరామా (2) కలిగి యజ్ఞముగాచే కౌసల్యరామా ॥ జయ జయ రామా సమరవిజయ రామా .. (ప..) చరణం 2 అరిరావణాంతక ఆదిత్యకులరామా గురుమౌనులనుగానే కోదండరామా । (2) ధర నహల్యపాలిటి దశరథరామా (2) హరురాణినుతుల లోకాభిరామా ॥ జయ జయ రామా సమరవిజయ రామా ..(ప..) చరణం 3 అతిప్రతాపముల మాయామృగాంతక రామా సుతకుశలవప్రియ సుగుణరామా । (2) వితత మహిమల శ్రీవేంకటాద్రిరామా (2) మతిలోనబాయని మనువంశరామా ॥ జయ జయ రామా సమరవిజయ రామా .. భయహర నిజభక్తపారీణ రామా ॥ (2.5)
Browse Related Categories: