View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

అన్నమయ్య కీర్తన నగవులు నిజమని


రాగం: ముఖారి
ఆ: స రి2 మ1 ప ని2 ద2 స
అవ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స

పల్లవి
నగవులు నిజమని నమ్మేదా ।
వొగినడియాసలు వొద్దనవే ॥ (2.5)

చరణం 1
తొల్లిటి కర్మము దొంతల నుండగ ।
చెల్లబోయిక జేసేదా । (2)
యెల్ల లోకములు యేలేటి దేవుడ । (2)
వొల్ల నొల్లనిక నొద్దనవే ॥ (2)
నగవులు నిజమని నమ్మేదా..(ప..)

చరణం 2
పోయిన జన్మము పొరుగులనుండగ ।
చీయనక యిందు జెలగేదా ।
వేయినామముల వెన్నుడమాయలు ।
ఓ యయ్య యింక నొద్దనవే ॥

చరణం 3
నలి నీనామము నాలికనుండగ ।
తలకొని యితరము చడవేదా । (2)
బలు శ్రీ వేంకటపతి నిన్నుగొలిచి ।
వొలుకు చంచలము లొద్దనవే ॥ (2)
నగవులు నిజమని నమ్మేదా ।
వొగినడియాసలు వొద్దనవే ॥ (2.5)




Browse Related Categories: