అన్నమయ్య కీర్తన ఏ పురాణముల నెంత వెదికినా
రాగం: హమ్సధ్వని ఆ: స రి2 గ3 ప ని3 స అవ: స ని3 ప గ3 రి2 స రాగం: గుండక్రియా ఆ: స రి1 మ1 ప ని3 స అవ: స ని3 ప ద1 ప మ1 గ3 రి1 స తాళం: ఆది పల్లవి ఏపురాణముల నెంత వెదికినా । శ్రీపతిదాసులు చెడ రెన్నడును ॥ (2) చరణం 1 వారివిరహితములు అవి గొన్నాళ్ళకు । విరసంబులు మరి విఫలములు । (2) నరహరి గొలి చిటు నమ్మినవరములు । (2) నిరతము లెన్నడు నెలవులు చెడవు ॥ ఏపురాణముల నెంత వెదికినా.. (ప..) చరణం 2 కమలాక్షుని మతి గానని చదువులు । కుమతంబులు బహుకుపథములు । (2) జమళి నచ్యుతుని సమారాధనలు । (2) విమలములే కాని వితథముగావు ॥ ఏపురాణముల నెంత వెదికినా.. (ప..) చరణం 3 శ్రీవల్లభుగతి జేరని పదవులు । దావతులు కపటధర్మములు । (2) శ్రీవేంకటపతి సేవించునేవలు । (2) పావనము లధిక భాగ్యపు సిరులు ॥ ఏపురాణముల నెంత వెదికినా.. (ప..) (2)
Browse Related Categories: