View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

అన్నమయ్య కీర్తన నిత్య పూజలివిగో


రాగం: పూజలివివో
ఆ: స రి2 గ2 మ1 ప ద2 ని2 స
అవ: స ని2 ద2 ప మ1 గ2 రి2 స
తాళం: ఆది

పల్లవి
నిత్య పూజలివిగో నెరిచిన నోహో ।
ప్రత్యక్షమైనట్టి పరమాత్మునికి నిత్య పూజలివిగో ॥

చరణం 1
తనువే గుడియట తలయె శిఖరమట
పెను హృదయమే హరి పీఠమట ।
కనుగొన చూపులే ఘన దీపములట
తన లోపలి అంతర్యామికిని ॥


చరణం 2
పలుకే మంత్రమట పాదయిన నాలుకే
కలకల మను పిడి ఘంటయట ।
నలువైన రుచులే నైవేద్యములట
తలపులోపలనున్న దైవమునకు ॥


చరణం 3
గమన చేష్టలే అంగరంగ గతియట
తమి గల జీవుడే దాసుడట ।
అమరిన ఊర్పులే ఆలబట్టములట
క్రమముతో శ్రీ వెంకటరాయునికి ॥




Browse Related Categories: