అన్నమయ్య కీర్తన నారాయణాఅయ నమో నమో
నారాయణాయ నమో నమో నానాత్మనే నమో నమో యీరచనలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ॥ గోవిందాయ నమో నమో గోపాలాయ నమో నమో భావజగురవే నమో నమో ప్రణవాత్మనే నమో నమో । దేవేశాయ నమో నమో దివ్యగుణాయ నమో యనుచు యీవరుసలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ॥ దామోదరాయ నమో నమో ధరణీశాయ నమో నమో శ్రీమహిళాపతయే నమో శిష్టరక్షిణే నమో నమో । వామనాయ తే నమో నమో వనజాక్షాయ నమో నమో యీమేరలనే యెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ॥ పరిపూర్ణాయ నమో నమో ప్రణవాగ్రాయ నమో నమో చిరంతన శ్రీ వేంకటనాయక శేషశాయినే నమో నమో । నరకధ్వంసే నమో నమో నరసింహాయ నమో నమో యిరవుగ నీగతి నెవ్వరు దలచిన యిహపర మంత్రము లిందరికి ॥
Browse Related Categories: