View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

అన్నమయ్య కీర్తన రాముడు రాఘవుడు


రాగం: ధర్మవతి
ఆ: స రి2 గ2 మ2 ప ద2 ని3 స
అవ: స ని3 ద2 ప మ2 గ2 రి2 స
తాళం: ఆది

పల్లవి
రాముడు రాఘవుడు రవికులు డితడు ।
భూమిజకు పతియైన పురుష నిధానము ॥ (2.5)

చరణం 1
అరయ పుత్రకామేష్టి యందు పరమాన్నమున ।
పరగ జనించిన పర బ్రహ్మము । (2)
సురల రక్షింపగ అసురుల శిక్షింపగ ।
తిరమై ఉదయించిన దివ్య తేజము ॥ (1.5)

రాముడు రాఘవుడు రవికులు డితడు ।
భూమిజకు పతియైన పురుష నిధానము ॥ (1.5)

చరణం 2
చింతించే యోగీంద్రుల చిత్త సరోజములలో ।
సంతతము నిలిచిన సాకారము । (2)
వింతలుగా మునులెల్ల వెదకిన యట్టి ।
కాంతుల చెన్ను మీరిన కైవల్య పదము ॥ (1.5)

రాముడు రాఘవుడు రవికులు డితడు ।
భూమిజకు పతియైన పురుష నిధానము ॥ (1.5)

చరణం 3
వేద వేదాంతములయందు విజ్ఞాన శాస్త్రములందు ।
పాదుకొన పలికేటి పరమార్ధము । (2)
ప్రోదితొ శ్రీ వేంకటాద్రి పొంచి విజయ నగరాన ।
ఆదికి అనాదియైన అర్చావతారము ॥ (1.5)

రాముడు రాఘవుడు రవికులు డితడు ।
భూమిజకు పతియైన పురుష నిధానము ॥ (1.5)




Browse Related Categories: