View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

అన్నమయ్య కీర్తన వందే వాసుదేవం


రాగం: శ్రీ
(22 ఖరహరప్రియ జన్య)
ఆ: స రి2 మ1 ప ని2 స
అవ: స ని2 ప ద2 ని2 ప మ1 రి2 గ2 రి2 స
తాళం: ఖన్డ చాపు

01:21-పల్లవి
వందే వాసుదేవం
బృందారకాధీశ వందిత పదాబ్జం ॥ (2.5)

చరణం 1
ఇందీవర శ్యామ మిందిరా కుచతటీ-
చందనాంకిత లసత్చారు దేహం । (2)
మందార మాలికా మకుట సంశోభితం (2)
కందర్పజనక మరవిందనాభం ॥ (2)
వందే వాసుదేవం బృందారకాధీశ..(ప..)

చరణం (2)
ధగధగ కౌస్తుభ ధరణ వక్షస్థలం
ఖగరాజ వాహనం కమలనయనం । (2)
నిగమాదిసేవితం నిజరూపశేషప- (2)
న్నగరాజ శాయినం ఘననివాసం ॥ (2)
వందే వాసుదేవం బృందారకాధీశ

చరణం 3
కరిపురనాథ సంరక్షణే తత్పరం
కరిరాజవరద సంగతకరాబ్జం । (2)
సరసీరుహాననం చక్రవిభ్రాజితం (2)
తిరు వేంకటాచలాధీశం భజే ॥ (2)
వందే వాసుదేవం
బృందారకాధీశ వందిత పదాబ్జం ॥




Browse Related Categories: