View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

అన్నమయ్య కీర్తన మంగాంబుధి హనుమంతా


రాగం: సామంత
ఆ: స రి2 గ3 మ1 ప ద3 ని3 స
అవ: స ని3 ద3 ని3 ద3 ప మ1 గ3 రి2 స

రాగం:ధర్మవతి

తాళం: ఆది
ఆ: స రి2 గ2 మ2 ప ద2 ని3 స
అవ: స ని3 ద2 ప మ2 గ2 రి2 స

పల్లవి
మంగాంబుధి హనుమంతా నీ శరణ ।
మంగవించితిమి హనుమంతా ॥ (2.5)

చరణం 1
బాలార్క బింబము ఫలమని ప ట్టిన
ఆలరి చేతల హనుమంతా । (2)
తూలని బ్రహ్మాదులచే వరములు
ఓలి చేకొనినా హనుమంతా ॥ (2)
మంగాంబుధి హనుమంతా నీ శరణ..(ప..)

చరణం 2
జలధి దాట నీ సత్వము కపులకు
అలరి తెలిపితివి హనుమంతా ।
ఇలయు నాకసము నేకముగా, నటు
బలిమి పెరిగితివి భళి హనుమంతా ॥

చరణం 3
పాతాళము లోపలి మైరావణు
ఆతల జంపిన హనుమంతా ।
చేతులు మోడ్చుక శ్రీ వేంకటపతి
నీ తల గోలిచే హిత హనుమంతా ॥
మంగాంబుధి హనుమంతా నీ శరణ ।
మంగవించితిమి హనుమంతా ॥ (2.5)




Browse Related Categories: