అన్నమయ్య కీర్తన కట్టెదుర వైకుంఠము
కట్టెదుర వైకుంఠము కాణాచయిన కొండ తెట్టరాయ మహిమలే తిరుమల కొండ ॥ వేదములే శిలలై వెలసినది కొండ యేదెస బుణ్యరాసులే యేరులైనది కొండ । గాదిలి బ్రహ్మాది లోకముల కొనలు కొండ శ్రీదేవు డుండేటి శేషాద్రి కొండ ॥ సర్వదేవతలు మృగజాతులై చరించే కొండ నిర్వహించి జలధులే నిట్టచరులైన కొండ । వుర్వి దపసులే తరువులై నిలచిన కొండ పూర్వ టంజనాద్రి యీ పొడవాటి కొండ ॥ వరములు కొటారుగా వక్కాణించి పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు సోబనపు గొండ । కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైన దదివో శ్రీ వేంకటపు గొండ ॥
Browse Related Categories: