అన్నమయ్య కీర్తన ఈ సురలు ఈ మునులు
ఈ సురలీమును లీచరాచరములు । యిసకలమంతయు నిది యెవ్వరు ॥ ఎన్నిక నామము లిటు నీవై యుండగ । యిన్ని నామము లిటు నీవై యుండగ । వున్నచోటనే నీవు వుండుచుండుగ మరి । యిన్నిటా దిరుగువా రిది యెవ్వరు ॥ వొక్కరూపై నీవు వుండుచుండగ మరి । తక్కిన యీరూపములు తామెవ్వరు । యిక్కడనక్కడ నీవు యిటు ఆత్మలలోనుండ । మక్కువ నుండువారు మరి యెవ్వరు ॥ శ్రీవేంకటాద్రిపై చెలగి నీ వుండగా । దైవంబులనువారు తామెవ్వరు । కావలసినచోట కలిగి నీవుండగ । యీవిశ్వపరిపూణు లిది యెవ్వరు ॥
Browse Related Categories: