View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

అన్నమయ్య కీర్తన గోవిందాశ్రిత గోకులబృందా


రాగం: ఖమాస్
ఆ: స మ1 గ3 మ1 ప ద2 ని2 స
అవ: స ని2 ద2 ప మ1 గ3 రి2 స
తాళం: ఆది

పల్లవి
గోవిందాశ్రిత గోకులబృందా ।
పావన జయజయ పరమానంద ॥ (2)

చరణం 1
జగదభిరామ సహస్రనామ ।
సుగుణధామ సంస్తుతనామ । (4)
గగనశ్యామ ఘనరిపు భీమ ।
అగణిత రఘువంశాంబుధి సోమ ॥ (4)
గోవిందాశ్రిత గోకులబృందా । (ప..)

చరణం 2
జననుత చరణా శరణ్యు శరణా ।
దనుజ హరణ లలిత స్వరణా ।
అనఘ చరణాయత భూభరణా ।
దినకర సన్నిభ దివ్యాభరణా ॥

చరణం 3
గరుడ తురంగా కారోత్తుంగా ।
శరధి భంగా ఫణి శయనాంగా । (4)
కరుణాపాంగా కమల సంగా ।
వర శ్రీ వేంకట గిరిపతి రంగా ॥ (4)
గోవిందాశ్రిత గోకులబృందా ।
పావన జయజయ పరమానంద ॥ (2)




Browse Related Categories: