అన్నమయ్య కీర్తన ఇప్పుడిటు కలగన్టి
రాగం: భూపాళం/ మోహన ఆ: స రి2 గ3 ప ద2 స అవ: స ద2 ప గ3 రి2 స తాళం: ఖండచాపు పల్లవి ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు । అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి ॥ (2.5) చరణం 1 అతిశయంబైన శేషాద్రిశిఖరము గంటి । ప్రతిలేని గోపుర ప్రభలు గంటి । (2) శతకోటి సూర్య తేజములు వెలుగగ గంటి । చతురాస్యు బొడగంటి చయ్యన మేల్కొంటి ॥ ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు .. (ప..) చరణం 2 కనకరత్న కవాట కాంతు లిరుగడగంటి । ఘనమైన దీపసంఘములు గంటి । (2) అనుపమ మణీమయమ్మగు కిరీటము గంటి । కనకాంబరము గంటి గ్రక్కన మేల్కొంటి ॥ ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు .. (ప..) చరణం 3 అరుదైన శంఖ చక్రాదు లిరుగడ గంటి । సరిలేని యభయ హస్తము గంటి । తిరువేంకటాచలాధిపుని జూడగ గంటి । హరి గంటి గురు గంటి నంతట మేల్కంటి ॥ ఇప్పుడిటు కలగంటి నెల్లలోకములకు । అప్పడగు తిరువేంకటాద్రీశు గంటి ॥ (2.5) (ప..)
Browse Related Categories: