అన్నమయ్య కీర్తన త్వమేవ శరణం
రాగం: పాడి / పహాడి (29 ధీర శన్కరాభరణం జన్య) ఆ: స రి2 గ3 ప ద2 ప ద2 స అవ: స రి2 గ3 ప ద2 ప ద2 స తాళం: ఆది పల్లవి త్వమేవ శరణం త్వమేవ శరణం కమలోదర శ్రీజగన్నాథా ॥ (2) చరణం 1 వాసుదేవ కృష్ణ వామన నరసింహ శ్రీ సతీశ సరసిజనేత్రా । (2) భూసురవల్లభ పురుషోత్తమ పీత- కౌశేయవసన జగన్నాథా ॥ (ప..) (1.5) చరణం 2 బలభద్రానుజ పరమపురుష దుగ్ధ జలధివిహార కుంజరవరద । (2) సులభ సుభద్రా సుముఖ సురేశ్వర కలిదోషహరణ జగన్నాథా ॥ (ప..) (1.5) చరణం 3 వటపత్రశయన భువనపాలన జంతు- ఘటకారకరణ శృంగారాధిపా । (2) పటుతర నిత్యవైభవరాయ తిరువేంకటగిరినిలయ జగన్నాథా ॥ (ప..) (1.5)
Browse Related Categories: