అన్నమయ్య కీర్తన చాలదా హరి నామ
రాగం: హంసధ్వని 29 ధీర శన్కరాభరణం జన్య ఆ: స రి2 గ3 ప ని3 స అవ: స ని3 ప గ3 రి2 స తాళం: ఆది / కండ చాపు పల్లవి చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు । చాలదా హితవైన చవులెల్లను నొసగ ॥ (3) చరణం 1 ఇది యొకటి హరి నామ మింతైన జాలదా చెదరకీ జన్మముల చెరలు విడిపించ । (2) మదినొకటె హరినామ మంత్రమది చాలదా । (2) పదివేల నరక కూపముల వెడలించ ॥ చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు । చాలదా హితవైన చవులెల్లను నొసగ ॥ చరణం 2 కలదొకటి హరినామ కనకాద్రి చాలదా । తొలగుమని దారిద్ర్యదోషంబు చెరుచ । తెలివొకటి హరినామదీప మది చాలదా । కలుషంపు కఠిన చీకటి పారద్రోల ॥ చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు । చాలదా హితవైన చవులెల్లను నొసగ ॥ చరణం 3 తగువేంకటేశు కీర్తనమొకటి చాలదా । జగములో కల్పభూజంబు వలె నుండ । (2) సొగసి యీవిభుని దాసుల కరుణ చాలదా । (2) నగవు జూపులను నున్నతమెపుడు జూప ॥ చాలదా హరి నామ సౌఖ్యామృతము దమకు । చాలదా హితవైన చవులెల్లను నొసగ ॥ (2) గోవింద హరి జయ గోపాల హరి జయ ...
Browse Related Categories: