View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

అన్నమయ్య కీర్తన చక్కని తల్లికి


రాగం: హంసధ్వని / పాడి
ఆ: స రి1 మ1 ప ని3 స
అవ: స ని3 ప ద1 ప మ1 రి1 స
తాళం: ఆది

పల్లవి
చక్కని తల్లికి చాంగుభళా
తన చక్కెర మోవికి చాంగుభళా ॥ (2.5)

చరణం 1
కులికెడి మురిపెపు కుమ్మరింపు తన
సళుపు జూపులకు చాంగుభళా । (2)
పలుకుల సొంపుల బతితో గసరెడి
చలముల యలుకకు చాంగుభళా ॥ (2)
చక్కని తల్లికి చాంగుభళా (ప..)

చరణం 2
కిన్నెరతో పతి కెలన నిలుచు తన
చన్ను మెఱుగులకు చాంగుభళా । (2)
ఉన్నతి బతిపై నొరగి నిలుచు తన
సన్నపు నడిమికి చాంగుభళా ॥ (2)
చక్కని తల్లికి చాంగుభళా (ప..)

చరణం 3
జందెపు ముత్యపు సరులహారముల
చందన గంధికి చాంగుభళా । (2)
విందయి వెంకట విభుబెన చినతన
సంది దండలకు చాంగుభళా ॥ (2) క్ష్
చక్కని తల్లికి చాంగుభళా (ప..)




Browse Related Categories: