View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in సరళ తెలుగు with simplified anusvaras. View this in శుద్ధ తెలుగు, with correct anusvaras marked.

అన్నమయ్య కీర్తన నెలమూడు శోభనాలు


రాగం: సోభనాలు
ఆ: స గ1 రి1 గ1 మ2 ప ద1 ని3 స
అవ: స ని3 ద1 ప మ2 గ1 రి1 స
తాళం: ఆది

పల్లవి
నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు ।
కలకాలమును నిచ్చకల్యాణమమ్మా ॥

చరణం 1
రామనామమతనిది రామవు నీవైతేను ।
చామన వర్ణమతడు చామవు నీవు । (2)
వామనుడందురతని వామనయనవు నీవు । (2)
ప్రేమపుమీ యిద్దరికి పేరుబలమొకటే ॥ (2)
నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు.. (ప..)(1.5)

చరణం 2
హరి పేరాతనికి హరిణేక్షణవు నీవు ।
కరిగాచెదాను నీవు కరియానవు । (2)
సరి జలధిశాయి జలధికన్యవు నీవు । (2)
బెరసి మీయిద్దరికి బేరుబలమొకటే ॥ (2)
నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు.. (ప..)(1.5)

చరణం 3
జలజ నాభుడతడు జలజముఖివి నీవు ।
అలమేలుమంగవు నిన్నెలమెదాను । (2)
ఇలలో శ్రీవేంకటేశుడిటు నిన్నురానమోచె । (2)
పిలిచి పేరుచెప్పెబేరుబలమొకటే ॥ (2)
నెలమూడు శోభనాలు నీకు నతనికిదగు ।
కలకాలమును నిచ్చకల్యాణమమ్మా ॥




Browse Related Categories: