అన్నమయ్య కీర్తన హరి నామము కడు
రాగం: భైరవి ఆ: స రి2 గ2 మ1 ప ద2 ని2 స అవ: స ని2 ద1 ప మ1 గ2 రి2 స తాళం: ... పల్లవి హరినామము కడు నానందకరము । మరుగవో మరుగవో మరుగవో మనసా ॥ (3.5) చరణం 1 నళినాక్షు శ్రీనామము కలిదోషహరము కైవల్యము । (2) ఫలసారము బహుబంధ మోచనము (2) తలచవో తలచవో మనసా ॥ (2) హరినామము కడు నానందకరము । (ప..) చరణం 2 నగధరు నామము నరకహరణము (2) జగదేకహితము సమ్మతము । (2) సగుణ నిర్గుణము సాక్షాత్కారము (2) పొగడవో పొగడవో పొగడవో మనసా ॥ (2) హరినామము కడు నానందకరము ।(ప..) చరణం 2 కడగి శ్రీవేంకటపతి నామము (2) ఒడి ఒడినే సంపత్కరము । (2) అడియాలం బిల నతి సుఖమూలము (2) తడవవో తడవవో తడవవో మనసా ॥ (2) హరినామము కడు నానందకరము । మరుగవో మరుగవో మరుగవో మనసా ॥ (ప..)
Browse Related Categories: