అన్నమయ్య కీర్తన గాలినే పోయ
రాగం: గుర్జరితోడి,కన్నడగౌళ ఆ: స రి2 గ2 మ1 ప ని2 స అవ: స ని2 ద2 ప మ1 గ2 స తాళం:చాపు పల్లవి గాలినే పోయ గలకాలము తాలిమికి గొంతయు బొద్దులేదు ॥ (2.5) చరణం 1 అడుసు చొరనే పట్టె నటునిటు గాళ్ళు గుడుగుకొననే పట్టె గలకాలము । (2) ఒడలికి జీవుని కొడయడైనహరి (2) దడవగా గొంతయు బొద్దులేదు ॥ (2) గాలినే పోయ గలకాలము (ఫా..)(1.5) చరణం 2 కలచి చిందనే పట్టె గడవగ నించగ బట్టె కలుషదేహపుబాధ గలకాలము । తలపోసి తనపాలి దైవమైన హరి దలచగా గొంతయు బొద్దులేదు । చరణం 3 శిరము ముడువబట్టె చిక్కుదియ్యగ బట్టె గరిమల గపటాల గలకాలము । (2) తిరువేంకటగిరి దేవుడైనహరి (2) దరిచేరా గొంతయు బొద్దులేదు ॥ (2) గాలినే పోయ గలకాలము తాలిమికి గొంతయు బొద్దులేదు ॥ (ప..) (2.5)
Browse Related Categories: