అన్నమయ్య కీర్తన మఙ్గామ్బుధి హనుమన్తా
రాగం: సామన్త ఆ: స రి2 గ3 మ1 ప ద3 ని3 స అవ: స ని3 ద3 ని3 ద3 ప మ1 గ3 రి2 స రాగం:ధర్మవతి తాళం: ఆది ఆ: స రి2 గ2 మ2 ప ద2 ని3 స అవ: స ని3 ద2 ప మ2 గ2 రి2 స పల్లవి మఙ్గామ్బుధి హనుమన్తా నీ శరణ । మఙ్గవిఞ్చితిమి హనుమన్తా ॥ (2.5) చరణం 1 బాలార్క బిమ్బము ఫలమని ప ట్టిన ఆలరి చేతల హనుమన్తా । (2) తూలని బ్రహ్మాదులచే వరములు ఓలి చేకొనినా హనుమన్తా ॥ (2) మఙ్గామ్బుధి హనుమన్తా నీ శరణ..(ప..) చరణం 2 జలధి దాట నీ సత్వము కపులకు అలరి తెలిపితివి హనుమన్తా । ఇలయు నాకసము నేకముగా, నటు బలిమి పెరిగితివి భళి హనుమన్తా ॥ చరణం 3 పాతాళము లోపలి మైరావణు ఆతల జమ్పిన హనుమన్తా । చేతులు మోడ్చుక శ్రీ వేఙ్కటపతి నీ తల గోలిచే హిత హనుమన్తా ॥ మఙ్గామ్బుధి హనుమన్తా నీ శరణ । మఙ్గవిఞ్చితిమి హనుమన్తా ॥ (2.5)
Browse Related Categories: