శ్రీ చక్ర పుర మన్దు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిదె నీరాజనం
బఙ్గారుతల్లికిదె నీరాజనం
బఙ్గారు హారాలు సిఙ్గారమొలకిఞ్చు అమ్బికా హృదయకు నీరాజనం
బఙ్గారుతల్లికిదె నీరాజనం
శ్రీ గౌరి శ్రీమాత శ్రీమహారాజ్ఞి శ్రీ సింహాసనేశ్వరికి నీరాజనం
బఙ్గారుతల్లికిదె నీరాజనం
కల్పతరువై మమ్ము కాపాడు కరములకు కవకమ్బు కాసులతో నీరాజనం
బఙ్గారుతల్లికిదె నీరాజనం
పాశాఙ్కుశ పుష్ప బాణచాపధరికి పరమ పావనమైన నీరాజనం
బఙ్గారుతల్లికిదె నీరాజనం
కాన్తి కిరణాలతో కలికి మెడలో మెరిసె కల్యాణ సూత్రమ్ము నీరాజనం
బఙ్గారుతల్లికిదె నీరాజనం
చిరునవ్వు లొలికిఞ్చు శ్రీదేవి అధరాన శతకో టి నక్షత్ర నీరాజనం
బఙ్గారుతల్లికిదె నీరాజనం
కలువరేకుల వణ్టి కన్నుల తల్లి శ్రీరాజరాజేశ్వరికి నీరాజనం
బఙ్గారుతల్లికిదె నీరాజనం
ముదమార మోమున ముచ్చటగ దరియిఞ్చు కస్తూరి కుఙ్కుమకు నీరాజనం
బఙ్గారుతల్లికిదె నీరాజనం
చన్ద్రవఙ్కనికిదె నీరాజనం
శుక్రవారమునాడు శుభములొసగే తల్లి శ్రీ మహాలక్ష్మి కిదె నీరాజనం
బఙ్గారుతల్లికిదె నీరాజనం
ముగ్గురమ్మలకును మూలమగు పెద్దమ్మ ముత్యాలతో నిత్య నీరాజనం
బఙ్గారుతల్లికిదె నీరాజనం
శృఙ్గేరి పీఠాన సున్దరాకారిణి సౌన్దర్యలహరికిదె నీరాజనం
బఙ్గారుతల్లికిదె నీరాజనం
సకల హృదయాలలో బుద్ధిప్రేరణ జేయు తల్లి గాయత్రికిదె నీరాజనం
బఙ్గారుతల్లికిదె నీరాజనం
దాన నరసింహుని దయతోడ రక్షిఞ్చు దయగల తల్లికిదె నీరాజనం
ఆత్మార్పణతో నిత్య నీరాజనం
శ్రీ చక్ర పుర మన్దు స్థిరమైన శ్రీ లలిత పసిడి పాదాలకిదె నీరాజనం
బఙ్గారుతల్లికిదె నీరాజనం