పాలమున్నీటిలో,పడవమ్పు లతగ,పసి వెన్న ముద్దగా,ప్రభవమ్బు నొన్ది,కలుములు వెదజల్లు,కలికి చూపులకు,మరులన్ది మధువుకై,మచ్చిక లట్లు,ముక్కోటి వేల్పులు,ముసురుకొనఙ్గ,తలపులో చర్చిఞ్చి,తగ నిరసిఞ్చి,అఖిల లోకాధారు-నిగమ సఞ్చారు,నతజనమన్దారు,నన్దకుమారు,వలచి వరిఞ్చిన వరలక్ష్మి గాథ,సకల పాపహరమ్బు,సమ్పత్కరమ్బు,ఘనమన్దారాద్రిని కవ్వమ్బుగాను,వాసుకి త్రాడుగా వరలఙ్గ చేసి,అమృతమ్బు కాఙ్క్షిఞ్చి అసురులు సురలు,చిలుకఙ్గ చిలుకఙ్గ క్షీరసాగరము,పరమ పావనమైన బారసినాడు,మెలుగారు తొలకరి మెరుపుల తిప్ప,ఒయ్యారముల లప్ప ఒప్పులకుప్ప,చిన్నారి పొన్నారి శ్రీమహాదేవి,అష్టదళాబ్జమన్దావిర్భవిఞ్చె,నిఙ్గిని తాకెడు నిద్దమ్పుటలలు,తూగుటుయ్యాలలై తుమ్పెసలార,బాల తా నటుతూగ పద్మమ్ముఛాయ,కన్నె తా నిటుతూగ కలువపూఛాయ,అటుతూగి ఇటుతూగి అపరఞ్జి ముద్ద,వీక్షిఞ్చు చుణ్డగా వెదురుమోసట్లు,పెరిగి పెణ్డిలియీడు పిల్లయ్యెనన్త,కల్పదృమమ్బున కళికలం బోలి,తనువున పులకలు దట్టమై నిగుడ,బార జాచి ప్రమోద భాష్పముల్ రాల,రావమ్మ భాగ్యాల రాశి రావమ్మా,రావమ్మ ఇన్దిరారమణి రావమ్మా,లోక శోకము బాపు లోలాక్షి వీవు,నాకు కూతురు వౌట నాపుణ్యమమ్మ,అఞ్చు మురిసిపోయి అమ్బుధిస్వామి,ఉప్పొఙ్గి ఉప్పొఙ్గి ఉప్పరం బణ్టె,సఖియను మఙ్గళ స్నాన మాడిమ్ప,వాసవుణ్డర్పిఞ్చె వజ్రపీఠమ్ము,పూతనదీజల పూర్ణపుణ్యాహ,కలశాలతోడ దిగ్గజము లవ్వేళ,జలజాతగన్ధికి జలకమ్ము లార్చె,బఙ్గారు సరిగఞ్చు పట్టుపుట్టమ్ము,కట్టఙ్గ సుతకిచ్చె కలశవారాశి,వెలలేని నగలిచ్చె విశ్వకర్ముణ్డు,రాజీవ ముఖులైన రమ్భాదు లన్త,కురులు నున్నగ దువ్వి,కుప్పెలు పెట్టి,కీల్జడ సవరిఞ్చి కిఞ్జల్కధూళి,చెదరని క్రొవ్విరుల్ చిక్కగ ముడిచి,కళల పుట్టినయిణ్డ్లు కన్నులకు,కమ్మని కవ్రమ్పు కాటుక దిద్ది,వెన్నెలతేటయౌ వెడదమోమునకు,గుమ్మడి విత్తన్త కుఙ్కుమ పెట్టి,అత్తరు జవ్వాజి అగరు చన్దనము,హత్తిఞ్చి,తనువెల్ల ఆమె మున్దటను,నిలువుటద్దమ్బును నిలిపి రన్తటను,తన రూపు శ్రీలక్ష్మి దర్పణ మ్మన్దు,కనుబొమ్మ నిక్కగా కనుగొని నవ్వి,సింహాసనము డిగ్గి చెఙ్గల్వదణ్డ,చేదాల్చి యచ్చరల్ చేరి కొల్వఙ్గ,కుచ్చెళ్ళు మీగాళ్ళ గునిసియాడఙ్గ,గరుడు గన్ధర్వ రాక్షస యక్ష దివిజ సఙ్ఘ మధ్యమునకు సరగౌన వచ్చె,చెప్ప చోద్యం బైన శృఙ్గారవల్లి,మొలకనవ్వుల ముద్దుమోమును జూచి,సోగకన్నుల వాలుచూపులు చూచి,ముదురు సమ్పెఙ్గ మొగ్గ ముక్కును జూచి,అమృతమ్బు దొలకెడు అధరమ్బు చూచి,సిగ్గులు సుడివడు చెక్కిళ్ళు చూచి,ముత్యాల మెచ్చని మునిపణ్డ్ల చూచి,పాలిణ్డ్ల జారు పయ్యెద చూచి,జవజవమను కౌసుసారును చూచి,గుణ్డ్రని పిరుదుల కుదిరిక చూచి,కమనీయ కలహంస గమనమ్బు చూచి,మొగమున కన్దమౌ మొటిమను జూచి,మధుసూదనుడు దక్క మగవారలెల్ల,వలపు నిక్కాకకు వశవర్తులైరి,కన్నుల కెగదన్ను కైపున తన్ను,తిలకిఞ్చు చున్నట్టి దిక్పాలకాది,సురవర్గమును గాఞ్చి సుదతి భావిఞ్చె,ఒక డణ్టరానివా డొకడు జారుణ్డు,ఒకడు రక్తపిపాసి ఒక్కడు జడధి,ఒకడు తిరిపిగా ఒకడు చఞ్చలుడు,కాయకణ్టి ఒకణ్డు,కటికవాడొకడు,ఒక్కటి తఱకైన ఒక్కటి తాలు,ఈ మొగమ్ములకటే ఇన్తిన్త నునుపు,శ్రీవత్సవక్షుణ్డు శ్రితరక్షకుణ్డు,పుణ్డరీకాక్షుణ్డు భువనమోహనుడు,శఙ్ఖ చక్రధరుణ్డు,శారఙ్గహస్తుణ్డు,తప్త చామీకర ధగధగ ద్ధగిత పీతామ్బరధరుణ్డు,ప్రియ దర్శనుణ్డు,మణిపుఞ్జ రఞ్జిత మఞ్జుల మకుట,మకర కుణ్డల హార మఞ్జీర కటక,కాఞ్చికా కేయూర క్రమభూషణుడు,అనుపమ జ్ఞాన బలైశ్వర్య వీర్య మాధుర్య గామ్భీర్య మార్ధ వౌదార్య శౌర్య ధైర్య స్థైర్య చాతుర్య ముఖ్య,కళ్యాణ గుణ గణౌఘ మహార్ణవుణ్డు,విశ్వమన్తయు తానైనవాడు,శేషాద్రినిలయుణ్డు శ్రీనివాసుణ్డు,పతియైన సుఖములు పడయఙ్గ వచ్చు,తులలేని భోగాల తులదూగ వచ్చు,ఏడేడు లోకాల నేలఙ్గ వచ్చు,అఞ్చు శౌరికి వైచె అలమేలు మఙ్గ,చెఙ్గల్వ విరిదణ్డ చిత్తముప్పొఙ్గ,సకల జగమ్బులు జయవెట్టు చుణ్డ,శచియు గౌరియు వాణి సర్వేశ్వరునకు,తలయణ్టి పన్నీట తాన మాడిఞ్చి,తడియొత్తి వేణుపత్రములన్త చేసి,నామమ్బులను దిద్ది నవభూషణముల గైసేయ దివిజవర్గముల గొలువ,కదలనై రావణగజముపై స్వామి,కేశవా యఞ్చును కీరముల్ పలుక,నారాయణాయఞ్చు నెమళుల్ పలుక,మాధవాయఞ్చును మధుపముల్ పలుక,గోవిన్ద యనుచును కోయిలల్ పలుక,తయితక్క ధిమితక్క తద్ధిమిత కిట ఝణుత తకఝణుత ఝణుత యటఞ్చు,అచ్చర విరిబోణు లాడి పాడఙ్గ,ముత్తైదువులు సేస ముత్యాలు చల్ల,చల్లగా వేఞ్చేయు జలదవర్ణునకు,అగ్రమ్బునన్ వేద ఆమ్నాయ ఘోష,వెనుక మన్త్రధ్వని వినువీధి ముట్టె,అదెవచ్చె ఇదెవచ్చె అల్లుడటఞ్చు,మామగారెదురేగి మధుపర్కమిచ్చె పన్దిటి లోనికి పట్టి తోడ్తెచ్చె,పుణ్య తీర్థమ్బులు ప్రోక్షిఞ్చి ఋషులు,మఙ్గళాశాసన మఙ్గళమ్మిడగ,కమలచేతికి చక్రి కట్టె కఙ్కణము,దివ్య శఙ్ఖమ్బులు తిరుచిన్నములును,వేణు మర్దల రుద్రవీణలు మొరయ,తలవఞ్చి కూర్చున్న తన్వి కణ్ఠమున,మధువైరి గీలిఞ్చె మాఙ్గళ్యమపుడు,చేతుల తలబ్రాలు చేకొని గూడ,పోయగా వెనుకాడు పువుబోణి మున్దు,శిరమువఞ్చిన యట్టి శ్రీధరుజూచి,పకపక నవ్విరి పల్లవాధరులు,పదునాల్గు భువనముల్ పాలిఞ్చు నట్టి,చల్లని విభునకు జయమఙ్గళమ్బు,పదము మోపిన చోట పసిడి పణ్డిఞ్చు,చూడికుత్తుకకు శుభమఙ్గళమ్బు,అఞ్చు హారతు లెత్త నఙ్గనామణులు,సాగె బువ్వముబన్తి సన్తోషముగను,కలిత కఙ్కణఝణాత్కారమ్ము లెసగ,కటకలఙ్ఘలాఘలాత్కారముల్ పొసగ,పిరుదులపై వేణి పిమ్పిళ్ళు గూయ,మొగమున తిలకమ్బు ముక్కున జార,చిరుచెమ్మటల దోగి చెదరు గన్ధమ్ము,ఘుమ ఘుమ వాసనల్ గ్రుమ్మరిమ్పఙ్గ,చురుకు జూపుల కోపు చూపఱ గుణ్డె,వలపు చిచ్చు రగుల్ప వగలాడి యొకతె,కోడిగ మ్మాడెను గోపాలు నిట్లు,మన పెణ్డ్లి కొడుకెన్తో మహనీయుడమ్మా,మహిళలన్ వలపిఞ్చు మన్త్రగాడమ్మా,మచ్చుమన్దులు చల్లి మది దోచుకున్న,కరివాని నెవ్వారు కామిన్తురమ్మా,సుకియలు పోళీలు సొగియవు గాని,పురపుర మట్టిని బొక్కెడు నణ్ట,పట్టె మఞ్చము వేసి పాన్పమరిమ్ప,పాముపై తాబోయి పవళిఞ్చు నణ్ట,అమ్బారియేనుగే అవతల కమ్పి,గద్ద మీద వయాళి గదలెడు నణ్ట,విన్తవేషములెన్నో వేసెడు నణ్టరాసిక్య మిటులుఞ్చి,రఙ్గటు లుఞ్చి,ఆకారసౌన్దర్యము అరయుద మ్మన్న,కనులు చేతులు మోము కాళ్ళు మొత్తమ్ము,తామరకలిమికి స్థానమ్ము సుమ్ము,ఈ యణ్టు మనబాల కెపుడణ్ట కుణ్డ,తామరసిరిగల ధన్యాత్మునకును,నలిచి నల్లేరుతో నలుగిడ వలెను,కన్ద నీటను ఒడల్ గడుగఙ్గ వలెను,గన్ధక లేపమ్ము కడుబూయ వలెను,వాడవాడల ద్రిప్పి వదలఙ్గ వలెను,ఆ మాటలాలిఞ్చి హరుపట్టమహిషి,మాధవుచెలియ ఆ బడతి కిట్లాడె,అతి విస్తారమ్బేల అన్దాలచిలుక,నీవు నేర్చిన తెన్గు నేర్తురే యొరులు,వెన్నుని నలుపఞ్చు వెక్కిరిఞ్చితివి,నెలతుక ఎరుపఞ్చు నిక్కు చూపితివి,కలువపూవు నలుపు కస్తూరి నలుపు,కన్దిరీగ ఎరుపు కాకి నోరెరుపు,ఈ రెణ్డు రఙ్గులన్దే రఙ్గు మెఋగో,సొడ్డు వేయుట గాదు సూటిగా జెప్పు,వరుని జూచిన కణ్ట వధువును జూడు,మాయ మర్మము వీడి మరి బదులాడు,కలికి కాల్సేతులు కన్నులు మోము,తామర విరిసిన తావులు గావో,తామరలో బుట్టి తామర బెరుగు,కొమ్మ మేనికి దూలగొణ్డి రాచెదవో,కన్దనీటి చికిత్స గారవిఞ్చెదవో,ఇన్తిన్త కన్నుల నెగదిజూచి,సిగ్గుతో నెమ్మోము చేత గప్పికొని,అనలుకొనలు వేయు అనురక్తితోడ,రసికత లేని మా రఙ్గని మెడను,పూలమాలను వేసి పొలుపుగా నతని,గుణ్డెలపై జేరి కులుకఙ్గ దలచు,రఙ్గనాయకి ఎన్త రసికురాలమ్మ,శఫరలోచన యెన్త చపలురాలమ్మ,ఆ నవ్వు లీనవ్వు లరవిరిమల్లె,అన్దాలు చిన్దుచు అలరిమ్ప మదులు,సకల వైభవముల జరిగెను పెణ్డ్లి,అమ్పకమ్ముల వేళ అరుదెఞ్చినన్త,పసుపు కుఙ్కుమ పూలు పణ్డు టెఙ్కాయ,తామ్బూల మొడి దాల్చి తరళాక్షి లక్ష్మి,తలపు లోపల కృఙ్గు తణ్డ్రిని జేరి,నాయనా యని పిల్చి నవదుఃఖ భాష్ప,కణములు జలజల కన్నుల రాల,గుణ్డెపై తలవాల్చి కుములు చుణ్డఙ్గ,కడివెడు బడబాగ్ని కడుపులో నణచి,శిరమును మూర్కొని చెక్కిళ్ళు నిమిరి,పాలపూసలతల్లి భాగ్యాలవెల్లి,వేడ్క అత్తిణ్టికి వెళ్ళి రావమ్మ,ఆడపిల్లలకు తణ్డ్రి అయ్యెడు కణ్టే,మతి గతి లేనట్టి మౌనాలు మేలు,వీనుల నీపాట వినిపిఞ్చు చుణ్డ,కన్నుల నీ ఆట కనిపిఞ్చు చుణ్డ,ఊరటతో నెట్టులున్దునే యమ్మ,గడియలో నిను వచ్చి కనకున్దు నమ్మ,అని సాగరుడు పుత్రి ననునయిమ్పగ బుద్ధులు గరపిరి పుణ్యకామినులు,ఏమి నోము ఫలమ్బో ఏమి భాగ్యమ్బో,వేదాన్త వేద్యుడు విభుడాయె నీకు,ఆముదాలన్నియు ఆణిముత్యములె,చిగురు బోణ్డ్లన్దరు సిన్ధుకన్యకలె,తల్లి నీవెరుగని ధర్మముల్ గలవే,నెలత నీ వెరుగని నీతులున్నవియే,పదుగురు నడచిన బాటయే బాట,మన్దికి నచ్చిన మాటయే మాట,మఞ్చిని విత్తిన మఞ్చి ఫలిఞ్చు,జొన్నలు విత్తిన చోళ్ళేల పణ్డు,పోయి రాగదమ్మ పుత్తడిబొమ్మ,నీదు పుట్టిణ్టిపై నెనరుమ్ప రమ్మ,కని పెఞ్చకున్నను కళ్యాణి,నిన్నులు కనులు చూడక ప్రొద్దు గడుచునే మాకు,చిలుకలు పల్కిన చివురుమావిళ్ళ,కోయిలల్ కూసిన గుణ్డెలెట్లాడు,పొగడ చెట్లకు వ్రేలు పూదోట్ల గన్న,నిమ్మళమ్బుగ నెట్లు నిలుతుమె కన్న,కాటుకకాయను కాన్త నేనిత్తు,కుఙ్కుమ భరిణిని కొమ్మ నేనిత్తు,జోడుసెమ్మెలు నీకు జోటి నేనిత్తు,పట్టిన దన్తయు బఙ్గారు కాగ,ముట్టిన దెల్లయు ముత్యమ్బు కాగ,కడుపుసారెకు వేగ కదలి రావమ్మ,మదిలోన మమ్ముల మరచిపోకమ్మ,అన్త మహాలక్ష్మి యనుగు నెచ్చెలుల,చెక్కులు ముద్దాడి చిబుకమ్బు లణ్టి,కణ్ఠమ్బు నిణ్డిన కన్నీళ్ళు నాపి బఙ్గారు చెలులారా!ప్రాణమ్బులారా!,నేనయి మీరెల్ల నెగడి మాయిణ్ట,అయ్య కన్నుల మున్దు ఆడుకోరమ్మ,పట్టుకుచ్చులు నావి పరికీణీల్ నావి,పన్దిట తూగాడు పయిటలు నావి,కాళ్ళగజ్జెలు నావి,కడియాలు నావి,స్వేచ్ఛగా మీరెల్ల చేకొన్రమ్మ,అప్పుడప్పుడు లచ్చి తలుచుకోరమ్మ,అని బుజ్జగములాడి యన్దలమ్బెక్కి,కమలాక్షునిణ్టికి కదలె శ్రీలక్ష్మి,కనుపాపలో క్రాన్తి క్రన్దుకొన్నట్లు,కణ్డచెక్కెర పాలు కలసియున్నట్లు,అఞ్జనాచల వాసు దలమేలుమఙ్గ,జణ్టవాయక సుఖ సన్తోష లీల,సాధు రక్షణమును సలుపుచున్నారు,సాధు రక్షణమును సలుపుచున్నారు.
అఋగని మఙ్గళసూత్రము చెరగని కుఙ్కుమ,పసుపు,చెదరని సిరులున్,తఋగని సుఖము లొసఙ్గును,హరిసతి యీ పాట విన్న అబలల కెపుడున్.