View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన అన్తర్యామి అలసితి


రాగం: ఆభోగి
ఆ: స రి2 గ2 మ1 ద2 స
అవ: స ద2 మ1 గ2 రి2 స
తాళం: ఆది

పల్లవి
అన్తర్యామి అలసితి సొలసితి ।
ఇన్తట నీ శరణిదె జొచ్చితిని ॥ (1.5)

చరణం 1
కోరిన కోర్కులు కోయని కట్లు
తీరవు నీవవి తెఞ్చక । (2)
భారపు బగ్గాలు పాప పుణ్యములు
నేరుపుల బోనీవు నీవు వద్దనక ॥ (1.5)
అన్తర్యామి అలసితి సొలసితి ।
ఇన్తట నీ శరణిదె జొచ్చితిని ॥ (1.5)

చరణం 2
జనుల సఙ్గముల జక్క రోగములు
విను విడువవు నీవు విడిపిఞ్చక ।
వినయపు దైన్యము విడువని కర్మము
చనదది నీవిటు శాన్తపరచక ॥

చరణం 3
మదిలో చిన్తలు మైలలు మణుగులు
వదలవు నీవవి వద్దనక । (2)
ఎదుటనె శ్రీ వెఙ్కటేశ్వర నీవదె
అదన గాచితివి అట్టిట్టనక ॥ (1.5)
అన్తర్యామి అలసితి సొలసితి ।
ఇన్తట నీ శరణిదె జొచ్చితిని ॥ (1.5)




Browse Related Categories: