View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన తెప్పగా మర్రాకు మీద


రాగమ్: లలితా
ఆ: స రి1 గ3 మ1 ద1 ని3 స
అవ: స ని3 ద1 మ1 గ3 రి1 స
తాళం: ఆది

పల్లవి
తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు ।
ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు ॥

చరణం 1
మోతనీటి మడుగులో యీతగరచినవాడు ।
పాతగిలే నూతిక్రిన్ద బాయనివాడు । (2)
మూతిదోసిపట్టి మణ్టి ముద్ద పెల్లగిఞ్చువాడు । (2)
రోతయైన పేగుల పేరులు గలవాడు ॥ (2)
తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు..(ప..)

చరణం 2
కోడికూత నోరివాని కుర్రతమ్ముడైనవాడు ।
బూడిద బూసినవాని బుద్ధులవాడు । (2)
మాడవన్నె లేడివెణ్ట మాయలబడినవాడు । (2)
దూడల నావులగాచి దొరయైనవాడు ॥ (2)
తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు..(ప..)

చరణం 3
ఆకసానబారే వూరి అతివల మానముల ।
కాకుసేయువాడు తురగముపైవాడు । (2)
ఏకమై వేఙ్కటగిరి నిన్దిరారమణి గూడి । (2)
యేకాలముబాయని యెనలేనివాడు ॥ (2)
తెప్పగా మర్రాకు మీద తేలాడువాడు ।
ఎప్పుడు లోకములెల్ల నేలేటివాడు ॥




Browse Related Categories: