View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన చదువులోనే హరిన


చదువులోనే హరిని జట్టిగొనవలెగాక ।
మదముగప్పినమీద మగుడ నది గలదా ॥

జడమతికి సహజమే సంసారయాతన యిది ।
కడు నిన్దులో బరము గడియిఞ్చవలెగాక ।
తొడరి గాలప్పుడు తూర్పెత్తక తాను ।
విడిచి మఱచిన వెనక వెదకితే గలదా ॥

భవబన్ధునకు విధిపాపపుణ్యపులఙ్కె ।
తివిరి యిన్దునే తెలివి తెలుసుకోవలెగాక ।
అవల వెన్నెలలోనే అల్లునేరే ళ్లిన్తే ।
నివిరి నిన్నటివునికి నేటికి గలదా ॥

దేహధారికి గలదే తెగనియిన్ద్రియబాధ ।
సాహసమ్బున భక్తి సాధిఞ్చవలెగాక ।
యిహలను శ్రీవేఙ్కటేశుదాసులవలన ।
వూహిఞ్చి గతిగానక వొదిగితే గలదా ॥




Browse Related Categories: