View this in:
English Devanagari Telugu Tamil Kannada Malayalam Gujarati Odia Bengali  |
Marathi Assamese Punjabi Hindi Samskritam Konkani Nepali Sinhala Grantha  |
This document is in శుద్ధ తెలుగు with the right anusvaras marked. View this in సరళ తెలుగు, with simplified anusvaras for easier reading.

అన్నమయ్య కీర్తన ఎణ్డ గాని నీడ గాని


రాగం: బౌళి
ఆ: స రి1 గ3 ప ద1 స
అవ: స ని3 ద1 ప గ3 రి1 స
తాళం: ఆది

పల్లవి
ఎణ్డగాని నీడగాని యేమైనగాని
కొణ్డల రాయడె మాకులదైవము ॥ (3.5)

చరణం 1
తేలుగాని పాముగాని దేవపట్టయినగాని (2)
గాలిగాని ధూళిగాని కానియేమైన ।
కాలకూటవిషమైనా గ్రక్కున మిఙ్గిన నాటి-
నీలవర్ణుడేమా నిజదైవము ॥

ఎణ్డగాని నీడగాని యేమైనగాని
కొణ్డల రాయడె మాకులదైవము ॥ (ప..)

చరణం 2
చీమగాని దోమగాని చెలది ఏమైనగాని (2)
గాముగాని నాముగాని కానియేమైన ।
పాములనిన్నిటి మ్రిఙ్గె బలుతేజిపై నెక్కు
ధూమకేతువేమో దొరదైవము ॥

ఎణ్డగాని నీడగాని యేమైనగాని
కొణ్డల రాయడె మాకులదైవము ॥ (ప..)

చరణం 3
పిల్లిగాని నల్లిగాని పిన్న ఎలుకైన గాని (2)
కల్లగాని పొల్లగాని కాని ఏమైన ।
బల్లిదుడై వేఙ్కటాద్రి పైనున్న యాతడి
మమ్మెల్ల కాలము నేలేటి యిణ్టిదైవము ॥

ఎణ్డగాని నీడగాని యేమైనగాని
కొణ్డల రాయడె మాకులదైవము ॥ (ప..) (3.5)




Browse Related Categories: