అన్నమయ్య కీర్తన విడువ విడువనిఙ్క
రాగం: సూర్యకాన్తం విడువవిడువనిఙ్క విష్ణుడ నీపాదములు కడగి సంసారవార్థి కడుముఞ్చుకొనిన ॥ పరమాత్మ నీవెన్దో పరాకైయున్నాను పరగ నన్నిన్ద్రియాలు పరచినాను । ధరణిపై చెలరేగి తనువు వేసరినాను దురితాలు నలువఙ్క~మ దొడికి తీసినను ॥ పుట్టుగు లిట్టె రానీ భువి లేక మాననీ వట్టి ముదిమైన రానీ వయసే రానీ । చుట్టుకొన్నబన్ధములు చూడనీ వీడనీ నెట్టుకొన్నయన్తరాత్మ నీకు నాకుబోదు ॥ యీదేహమే యయిన ఇక నొకటైనాను కాదు గూడదని ముక్తి కడకేగినా । శ్రీదేవుడవైన శ్రీవేఙ్కటేశ నీకు సోదిఞ్చి నీశరణమే చొచ్చితి నేనికను ॥
Browse Related Categories: