అన్నమయ్య కీర్తన కామధేనువిదే
కామధేను విదే కల్పవృక్ష మిదే ప్రామాణ్యము గల ప్రపన్నులకు ॥ హరినామజపమే ఆభరణమ్బులు పరమాత్మునినుతి పరిమళము । దరణిదరు పాదసేవే భోగము పరమమ్బెరిగిన ప్రపన్నులకు ॥ దేవుని ధ్యానము దివ్యాన్నమ్బులు శ్రీవిభు భక్తే జీవనము । ఆవిష్ణు కైఙ్కర్యమే సంసారము పావనులగు యీ ప్రపన్నులకు ॥ యేపున శ్రీవేఙ్కటేశుడే సర్వము దాపై యితని వన్దనమే విధి । కాపుగ శరణాగతులే చుట్టాలు పై పయి గెలిచిన ప్రపన్నులకు ॥
Browse Related Categories: