అన్నమయ్య కీర్తన కణ్టి శుక్రవారము
రాగం: కురిన్జి ఆ: స ని3 స రి2 గ3 మ1 ప ద2 అవ: ద2 ప మ1 గ3 రి2 స ని3 స తాళం: పల్లవి కణ్టి శుక్రవారము గడియ లేడిణ్ట । అణ్టి అలమేల్మఙ్గ అణ్డనుణ్డే స్వామిని ॥ (2.5) చరణం 1 సొమ్ములన్నీ కడపెట్టి సొమ్పుతో గోణముగట్టి । కమ్మని కదమ్బము కప్పు కన్నీరు । (2) చెమ్మతోను వేష్టువలు రొమ్ముతల మొలజుట్టి । (2) తుమ్మెద మైచాయతోన నెమ్మదినుణ్డే స్వామిని ॥ కణ్టి శుక్రవారము గడియ లేడిణ్ట .. (ప..) చరణం 2 పచ్చకప్పురమే నూరిపసిడి గిన్నెలనిఞ్చి । తెచ్చి శిరసాదిగ దిగనలది । (2) అచ్చెరపడి చూడనన్దరి కనులకిమ్పై । (2) నిచ్చమల్లె పూవువలె నిటుతానుణ్డే స్వామిని ॥ కణ్టి శుక్రవారము గడియ లేడిణ్ట .. (ప..) చరణం 3 తట్టుపునుగే కూరిచిచట్టలు చేరిచినిప్పు । పట్టి కరిగిఞ్చు వెణ్డి పళ్యాలనిఞ్చి । (2) దట్టముగ మేను నిణ్డపట్టిఞ్చి దిద్ది । (2) బిట్టు వేడుక మురియు చుణ్డేబిత్తరి స్వామిని ॥ కణ్టి శుక్రవారము గడియ లేడిణ్ట అణ్టి అలమేల్మఙ్గ అణ్డనుణ్డే స్వామిని ॥ (2.5) (ప..)
Browse Related Categories: