అన్నమయ్య కీర్తన మనుజుడై పుట్టి
రాగం: ఆభోగి (22 ఖరహరప్రియ జన్య) ఆ: స రి2 గ2 మ1 ద2 స అవ: స ద2 మ1 గ2 రి2 స తాళం: ఆది పల్లవి మనుజుడై పుట్టి మనుజుని సేవిఞ్చి అనుదినమును దుఃఖమన్దనేలా ॥ (2.5) చరణం 1 జుట్టెడు కడుపుకై చొరని చోట్లు జొచ్చి పట్టెడు కూటికై బతిమాలి । (3.5) పుట్టిన చోటికే పొరలి మనసువెట్టి వట్టి లమ్పటము వదలనేరడుగాన ॥ (2.5) మనుజుడై పుట్టి మనుజుని సేవిఞ్చి (ప.) అనుదినమును దుఃఖమన్దనేలా (ప.) చరణం 2 అన్దరిలో పుట్టి అన్దరిలో చేరి అన్దరి రూపములటు తానై । అన్దమైన శ్రీ వేఙ్కటాద్రీశు సేవిఞ్చి అన్దరాని పద మన్దెనటుగాన ॥ మనుజుడై పుట్టి మనుజుని సేవిఞ్చి (ప.) అనుదినమును దుఃఖమన్దనేలా (ప.)
Browse Related Categories: