అన్నమయ్య కీర్తన కణ్టి నఖిలాణ్డ
రాగం: మధ్యమావతి,బిలహరి ఆ: స రి2 మ1 ప ని2 స అవ: స ని2 ప మ1 రి2 స రాగం: బిలహరి ఆ: స రి2 గ3 ప ద2 స అవ: స ని3 ద2 ప మ1 గ3 రి2 స తాళం: పల్లవి కణ్టి నఖిలాణ్డ తతి కర్తనధికుని గణ్టి । కణ్టి నఘములు వీడుకొణ్టి నిజమూర్తి గణ్టి ॥ (2) చరణం 1 మహనీయ ఘన ఫణామణుల శైలము గణ్టి । బహు విభవముల మణ్టపములు గణ్టి । (2) సహజ నవరత్న కాఞ్చన వేదికలు గణ్టి । రహి వహిఞ్చిన గోపురములవె కణ్టి ॥ (2) కణ్టి నఖిలాణ్డ తతి కర్తనధికుని గణ్టి । (ఫా..) చరణం 2 పావనమ్బైన పాపవినాశము గణ్టి । కైవశమ్బగు గగన గఙ్గ గణ్టి । (2) దైవికపు పుణ్యతీర్థములెల్ల బొడగణ్టి । కోవిదులు గొనియాడు కోనేరి గణ్టి ॥ (2) కణ్టి నఖిలాణ్డ తతి కర్తనధికుని గణ్టి । (ఫా..) చరణం 3 పరమ యోగీన్ద్రులకు భావగోచరమైన । సరిలేని పాదామ్బుజముల గణ్టి । తిరమైన గిరిచూపు దివ్యహస్తము గణ్టి । తిరు వేఙ్కటాచలాధిపు జూడగణ్టి ॥ కణ్టి నఖిలాణ్డ తతి కర్తనధికుని గణ్టి । (ఫా..) కణ్టి నఘములు వీడుకొణ్టి నిజమూర్తి గణ్టి ॥
Browse Related Categories: